క్షణం ఆలోచించలేదు.. వాళ్ల కోసమే కల్కి చేశా: మృణాల్‌ ఠాకూర్‌ | Mrunal Thakur Says Did Not Even Take a Moment On Her Cameo in Kalki 2898 AD | Sakshi
Sakshi News home page

Mrunal Thakur: కల్కి సినిమా.. వాళ్ల మీద నమ్మకంతో చేశా..

Published Sat, Jun 29 2024 2:41 PM | Last Updated on Sat, Jun 29 2024 4:12 PM

Mrunal Thakur Says Did Not Even Take a Moment On Her Cameo in Kalki 2898 AD

అందరూ ఎదురుచూసిన కల్కి 2898 ఏడీ మూవీ ఎట్టకేలకు గురువారం (జూన్‌ 27) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ విజువల్‌ వండర్‌ను చూసిన సినీప్రియులు హాలీవుడ్‌ సినిమాను మించిపోయిందని ఖుషీ అవుతున్నారు. యాక్టర్స్‌ పోటీపడి మరీ నటించారని సినిమా చూస్తేనే తెలిసిపోతుంది. భైరవగా ప్రభాస్‌ ఎంత మెప్పించాడో అశ్వత్థామగా అమితాబ్‌ అంతే స్థాయిలో అదరగొట్టాడు. 

వారిపై నమ్మకంతోనే..
విజయ్‌ దేవరకొండ, ఫరియా అబ్దుల్లా, దుల్కర్‌ సల్మాన్‌, మృణాల్‌ ఠాకూర్‌ అతిథి పాత్రల్లో కనిపించి మురిపించారు. అయితే తాను కల్కి మూవీలో గెస్ట్‌ రోల్‌లో నటించడానికి ఈ ముగ్గురే కారణమంటోంది మృణాల్‌. ఆమె మాట్లాడుతూ.. కల్కి సినిమా గురించి నన్ను సంప్రదించినప్పుడు క్షణం ఆలోచించలేదు. ఎందుకంటే నిర్మాతలు అశ్విని దత్‌, స్వప్న దత్‌, ప్రియాంకలపై నాకు పూర్తి నమ్మకం ఉంది. 

అందువల్లే ఈజీగా
వారితో కలిసే సీతారామం సినిమా చేశాను. దానివల్లే ఈసారి ఈజీగా నిర్ణయం తీసుకున్నాను. ఇంత అద్భుతమైన ప్రాజెక్ట్‌లో భాగమవడం సంతోషంగా ఉంది అని చెప్పుకొచ్చింది. కాగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించిన కల్కి మూవీ రెండు రోజుల్లోనే రూ.298 కోట్లు రాబట్టింది. వీకెండ్‌ కలిసొస్తుండటంతో ఈ శని, ఆదివారాల్లో ఇంకెత రాబడుతుందో చూడాలి!

చదవండి: హృతిక్‌ రోషన్‌ అలా చేస్తాడనుకోలేదు: బాలీవుడ్‌ నటుడు
'కల్కి 2' షూటింగ్ 60% అయిపోయింది.. నిర్మాత కామెంట్స్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement