డబ్బులిస్తే ఏ పనైనా చేయడానికి సిద్ధం అనేవాళ్లు చాలామంది! స్టార్ హీరోలు కూడా ఇందుకు అతీతం కాదు. కోట్లాది రూపాయలు ఆశ చూపిస్తే చాలు.. పాన్ మసాలా, బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్‌లో కనిపిస్తారు. అవి మంచివి కావని తెలిసినా యాడ్స్‌లో నటించి జనాలను ఎంకరేజ్ చేస్తారు. ఈ ధోరణి అస్సలు మంచిది కాదంటున్నాడు ప్రముఖ నటుడు గోవింద్ నాందేవ్.
హృతిక్ రోషన్ అంటే అభిమానం
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. నటీనటులు బాధ్యతగా వ్యవహరించాలి. కొత్త జనరేషన్‌కు వారొక దిక్సూచీలా ఉండాలి. అభిమానులను పెడదారి పట్టించే పనుల జోలికి వెళ్లకూడదు. నాకు హృతిక్ రోషన్ అంటే చాలా ఇష్టం.. తనపై ఎంతో అభిమానగౌరవం ఉండేది. కానీ చివరకు తను కూడా గుట్కా యాడ్‌లో కనిపించాడు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడు. అది చూసి నాకు తల తిరిగిపోయింది. ఈయన ఎందుకిలాంటివి చేస్తున్నాడనిపించింది.
అది తప్పు కాదా?
యాడ్‌లో గుట్కా, బెట్టింగ్ మంచిదేనని హీరోలు పొగిడితే జనాలు అవి అలవాటు చేసుకోరా? అనుకరించరా? ప్రజలను తప్పుదారి పట్టించకుండా నటులు బాధ్యతగా ఉండొచ్చు కదా! జనాల వల్లే హీరోలుగా అందనంత ఎత్తులో ఉన్నప్పుడు వారికి హాని చేసేవాటిని ఎంకరేజ్ చేయడం తప్పు కాదా? అని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇప్పటికీ బాధపడుతున్నా
20 ఏళ్ల క్రితం తనకంత అవగాహన లేక ఓ పాన్ మసాలా యాడ్‌లో నటించానని, అందుకు ఇప్పటికీ బాధపడుతున్నట్లు గోవింద్ నాందేవ్ తెలిపాడు. అప్పట్లో నటుడిగా బాధ్యతగా వ్యవహరించాలన్న జ్ఞానం లేకపోవడం వల్లే సదరు ప్రకటనలో కనిపించానన్నాడు. తర్వాత అలాంటి తప్పు మళ్లీ ఎన్నడూ రిపీట్ చేయలేదన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment