The Family Star Movie Trending Now On Top Of OTT Streaming Platform Amazon Prime, Deets Inside | Sakshi
Sakshi News home page

Family Star Movie OTT Response: 'ఫ్యామిలీ స్టార్' పై తేలిపోయిన దుష్ప్రచారం

Published Tue, Apr 30 2024 10:51 AM | Last Updated on Tue, Apr 30 2024 2:58 PM

The Family Star Movie Trending Now OTT Streaming

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ "ఫ్యామిలీ స్టార్". ఇప్పటికే థియేటర్‌లో ప్రేక్షకులను మెప్పించిన సినిమా రీసెంట్‌గా అమోజాన్ ప్రైమ్ వీడియోలోకి స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నామంటూ పలువురు నెటిజన్స్ సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఫ్యామిలీ స్టార్ విడుదల సమయంలో సినిమా మీద కొందరు చేసిన నెగిటివ్ ప్రచారం నిజమేననుకుని సినిమాను థియేటర్‌లో చూడలేదని, ఇప్పుడు ప్రైమ్ వీడియోలో సినిమాను ఎంజాయ్ చేస్తున్నామంటూ నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. 

విజయ్, మృణాల్ జోడీ ఈ సినిమాకు బాగా కలిసొచ్చిన అంశమని తెలుపుతున్నారు. కథలో హీరో తన గురించి ఆలోచించుకోకుండా ఫ్యామిలీ కోసం నిలబడటం అనే కాన్సెప్ట్‌ అందరూ ఆలోచించతగినట్లూ ఉందంటూ వారు తెలుపుతున్నారు. సోషల్‌ మీడియాలో కొందరు కావాలని ఈ సినిమా పట్ల తప్పుగా ప్రచారం చేసినా కూడా విజయ్ క్రేజ్‌తో  ఫ్యామిలీ స్టార్ సినిమా మాస్, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు రీచ్ అయ్యింది. బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ కలెక్షన్స్ అందుకుంది. ఇప్పుడు ఓటీటీ రిలీజ్‌తో ఆ దుష్ప్రచారం అంతా తేలిపోయింది. 

ఇండియాలోనే కాదు అమెరికాలోనూ ఫ్యామిలీ స్టార్ సినిమాను ప్రైమ్ వీడియోలో చూస్తున్నవారు సోషల్ మీడియా వేదికగా పాజిటివ్ గా స్పందిస్తున్నారు. మిగతా సినిమాల్లాగే ఫ్యామిలీ స్టార్ లోనూ కొన్ని మిస్టేక్స్ ఉన్నా సినిమా అన్ని అంశాల్లో బాగుందని చెబుతున్నారు. ఫ్యామిలీ స్టార్ ఓటీటీ రెస్పాన్స్ తో సోషల్ మీడియా నెగిటివ్ ప్రాపగండా నమ్మొద్దనే రియలైజేషన్ ప్రేక్షకుల్లో కలుగుతోంది. ఇది విజయ్ దేవరకొండ నెక్ట్ సినిమాలకు తప్పకుండా ఉపయోగపడనుంది. అమెజాన్‌ ప్రైమ్‌లో టాప్‌ వన్‌లో ఫ్యామిలీ స్టార్‌ చిత్రం దూసుకుపోతుంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement