
‘నా ప్రేమ విఫలమైంది’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు హీరో విజయ్ దేవరకొండ. ఆయన హీరోగా రూపొందిన ‘ఫ్యామిలీ స్టార్’ ఈ నెల 5న రిలీజవుతోంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు విజయ్ దేవరకొండ. ‘‘జీవితంలో అందరూ ఏదో ఒక సమయంలో రిలేషన్‌షిప్‌లో ఉంటారు. నా ఫ్రెండ్స్‌లో కూడా పలువురు ప్రేమలో పడ్డారు. అయితే కొన్ని కారణాల వల్ల భాగస్వామితో విడిపోయి, ఎంతో బాధ పడ్డారు. ఆ తర్వాత మరొకరి ప్రేమలో పడి సంతోషంగా ఉన్నారు. ఒకరితో బ్రేకప్ అయ్యాక మరొకరితో ప్రేమలో ఉండటం సహజమే.
అయితే ఒకే టైమ్‌లో ఇద్దరితో లవ్‌లో ఉండటాన్ని ప్రోత్సహించను. మహిళలపై నాకు చాలా గౌరవం ఉంది. ఒకరితో ప్రేమలో ఉన్నప్పుడు వేరే అమ్మాయిని నా జీవితంలోకి ఆహ్వానించను. గతంలో నేనొక అమ్మాయిని ప్రేమించాను. కానీ, ఆ ప్రేమ విఫలమైంది’’ అన్నారు. కొత్త దర్శకులకు చాన్స్ ఇవ్వడం గురించి ఇదే ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘ప్రస్తుతానికి కొత్త దర్శకులతో పని చేయాలనుకోవడం లేదు. అనుభవం లేకపోతే మేకింగ్, బడ్జెట్ మేనేజ్ చేయడం కష్టం. ఒక్క మూవీ చేసిన దర్శకుడితో అయినా పని చేస్తా. ఎందుకంటే వారికి మేకింగ్‌పై అవగాహన ఉంటుంది. అయితే వారి గత సినిమా హిట్టా? ఫట్టా అనేది మాత్రం ఆలోచించను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment