అన్నీ అనుకున్నట్లుగా జరగవు.. ఇది సినిమాకూ వర్తిస్తుంది. సినిమా మొదలుపెట్టినప్పుడు ఎన్నో పాత్రలు రాసుకుంటారు, షూటింగ్ చేస్తారు. తీరా ఎడిటింగ్‌లో సగం కంటే ఎక్కువ పాత్రలు డిలీట్ చేస్తారు. మరికొన్నింటిని నిమిషాల నుంచి సెకన్లకు కుదిపేస్తారు. అలా ఇటీవలే డీజే టిల్లులో శ్రీసత్యకు అన్యాయం చేశారు. తనతో డైలాగులు చెప్పించి మరీ ఎడిటింగ్‌లో అదంతా తీసేయించారు.
అందరి టైం వేస్ట్
ఇప్పుడు తనకూ అలాంటి అన్యాయమే జరిగిందంటోంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ ఆశా బోరా. నాలాంటిదాన్ని పిలిచి మరీ స్టఫ్‌లా వాడుకుని వదిలేస్తే సినిమా అట్టర్ ఫ్లాప్ కాకపోతే ఇంకేం అవుతుంది.. సీన్లు, సాంగ్సు, ఫ్యామిలీ ఫంక్షన్లు.. ఇలా ప్రతిదాంట్లోనూ నేనే కనిపించానుగా.. అంటూ వ్యంగ్యంగా సెటైర్లు వేసింది. 'ఇంతోటిదానికి నా టైం వేస్ట్ చేసి, మీ టైం వేస్ట్ చేసుకున్నారు. ఈ పాత్ర నేనే చేయాలంటూ అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గరి నుంచి కాస్టింగ్ డైరెక్టర్ వరకు అందరూ ఫోన్లు చేసి అనవసరంగా హంగామా చేశారు.
ఆరోగ్యం బాలేకపోయినా..
ఉఫ్.. అయినా హైదరాబాద్‌లో జూనియర్ ఆర్టిస్టులకు కరువొచ్చిందా? లేక సోషల్ మీడియా ఫేస్‌లను ఉపయోగించుకోవాలని చేశారో మరి! మా పనులు మానుకొని, కుటుంబాన్ని వదిలేసి వచ్చి ఒక రోజంతా నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి, ఆరోగ్యం బాగోలేకపోయినా చెప్పిన మాట కోసం షూటింగ్‌కు వచ్చాను. యాంటి బయాటిక్స్ వేసుకుని, పొద్దున్నుంచి సాయంత్రం దాకా నిలబడి ఉంటే కనీసం ఒక్క డైలాగ్ కూడా లేదు.
డైలాగ్స్ ఉంచినా బాగుండేది
ఇస్తామన్న రెమ్యునరేషన్ ఇవ్వకుండా, ట్రావెలింగ్ ఖర్చులు చెల్లించకుండా, హోటల్‌లో బస చేసేందుకు డబ్బులివ్వకుండా, మాకేంటి సంబంధం అన్నట్లు సరిగా స్పందించనుకూడా లేదు. వాహ్.. గ్రేట్! కనీసం విజయ్ దేవరకొండతో నేను మాట్లాడిన సంభాషణలు ఉంచినా కాస్త సంతృప్తి ఉండేదేమో! మీ ఎడిటింగ్ అలా ఉంది. నా కళ్లు తెరిపించినందుకు థ్యాంక్స్. ఇలా ప్రశ్నిస్తే కాంట్రవర్సీ అని ట్యాగ్ లైన్ ఇస్తారు.. ఇస్తారేంటి? ఇచ్చేశారు కూడా!' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యామిలీ స్టార్ టీమ్‌పై విమర్శలు గుప్పించింది.
చదవండి: ‘ఫ్యామిలీ స్టార్’బంపరాఫర్.. మీ ఇంటికే విజయ్ దేవరకొండ!
Comments
Please login to add a commentAdd a comment