
\విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన తాజా చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. ‘గీతగోవిందం’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత పరశురామ్, విజయ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన రెండో చిత్రమిది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించారు. ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం చిత్రబృందం అంతా ప్రమోషన్స్‌లో బిజీ అయిపోయింది. విజయ్ దేవరకొండ, దిల్ రాజు అటు తమిళ్‌లోనూ ఇటు తెలుగులోనూ తెగ ప్రచారం చేస్తున్నారు. ఇటీవల గ్రాండ్‌గా ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘గీతగోవిందం’ నా కెరీర్‌లో సూపర్ హిట్ మూవీ. ఇప్పటివరకు ఈ సినిమాను బీట్ చేసే మూవీ చేయలేదు. కెరీర్ ఆరంభంలో నేను నటించిన చిత్రం రూ. 100 కోట్లు కలెక్ట్ చేస్తే బాగుండని ఎన్నోసార్లు అనుకున్నాను. నా నాలుగో సినిమా గీతగోవిందంతోనే అది నిజమైంది. ఇటీవల నేను నటించిన ఓ సినిమా రూ.200 కోట్లు కలెక్ట్ చేస్తుందని చెప్పా. కానీ అది జరగలేదు. ఆ సమయంలో చాలా మంది నన్ను కామెంట్ చేశారు.
అలాంటి స్టేట్‌మెంట్స్ ఎందుకు ఇస్తావని విమర్శించారు. నేను అలా స్టేట్‌మెంట్ ఇవ్వడం తప్పు కాదు. స్టేట్‌మెంట్స్ ఇచ్చి విజయం సాధించకపోవడం తప్పు. ఏదో ఒకరోజు ఆ స్థాయి కలెక్షన్స్ సాధిస్తా. అప్పటి వరకు మేరు ఎంత తిట్టినా పడతా. ఇప్పుడు కూడా నా మాటల్ని బలుపు అనుకుంటారు. కానీ.. నాపై నాకు ఉన్న నమ్మకం. అదే నమ్మకంతో చెప్తున్నా. ఇంకొకరు స్టార్ అయితే మనం అవ్వలేమా ఏంటీ.. నేను స్టార్ అయితే మీరు అవ్వలేరా ఏంటీ.. వాళ్లు రూ.200 కోట్లు కొడితే మనం కొట్టలేమా? ఏంటీ.. నేను కొడితే మీలో ఒకరు కొట్టలేరా ఏంటీ.. ఇదో జర్నీ.. మన లైఫ్‌లో ఎన్నో చూడాల్సి వస్తుంది. ఎన్నో అవమానాలు.. కిందకి లాగేవాళ్లని చూస్తుంటారు. వీటన్నింటినీ దాటుకుంటూ వెళ్లడమే జీవితం’ అని విజయ్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment