ఫ్యామిలీస్టార్‌ నుంచి టాప్‌ సింగర్‌ పాట రిలీజ్‌ | Madhuramu Kadha Lyrical Song Out From Family Star | Sakshi
Sakshi News home page

ఫ్యామిలీస్టార్‌ నుంచి టాప్‌ సింగర్‌ పాట రిలీజ్‌

Mar 25 2024 2:03 PM | Updated on Mar 25 2024 2:48 PM

Madhuramu Kadha Lyrical Song Out From Family Star - Sakshi

టాలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ దేవరకొండ- మృణాల్‌ ఠాకూర్‌ జోడీగా తెరకెక్కుతున్న చిత్రం  ‘ఫ్యామిలీస్టార్‌’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై నిర్మించిన ఈ చిత్రాన్ని రాజు - శిరీశ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. నేడు హోలి సందర్భంగా ఒక లిరికల్‌ సాంగ్‌ను మేకర్స్‌ విడుదల చేశారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలతో పాటు టీజర్, గ్లింప్స్ విడుదలయ్యాయి. అవన్నీ కూడా ప్రేక్షకులను మెప్పించాయి. దీంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. తాజాగా 'మధురము కదా ప్రతొక నడక నీతో కలిసేలా..' అనే మెలోడీ సాంగ్‌ అందరినీ ఆకట్టుకుంటుంది.  గోపి సుందర్ సంగీతానికి ప్రముఖ సింగర్‌ శ్రేయ ఘోషల్ గాత్రం తోడు కావడంతో పాటకు మరింత మధురం వచ్చిందని చెప్పవచ్చు. ‘ఫ్యామిలీస్టార్‌’ విడుదల తేదీ కూడా ఇప్పటికే ఖరారైంది. వేసవి సందర్భంగా ఏప్రిల్‌ 5న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement