
మృణాల్ ఠాకూర్.. తొలి చిత్రం 'సీతారామం'తో తెలుగు ప్రేక్షకుల మది దోచి ఇక్కడ వరుస సినిమాలు చేస్తుంది. మొదటి సినిమాతోనే తెలుగింటి అమ్మాయిగా తనను అంగీకరించిన టాలీవుడ్ ప్రేక్షకుల పట్ల తనూ ఎప్పుడూ కృతజ్ఞత భావంతో ఉంటుంది. సందర్భం వచ్చిన ప్రతిసారి తెలుగు ప్రేక్షకుల పట్ల తన ప్రేమ,గౌరవాన్ని చూపుతుంది.
తాజాగా ఫ్యామిలీ స్టార్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మృణాల్ ఠాకూర్ తెలుగు ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడుతూ స్టేజీపైనే సాష్టాంగ నమస్కారం చేసింది. 'నన్ను అందరూ మీ తెలుగమ్మాయిగా అంగీకరించారు కాబట్టే నేనే ఈరోజు ఇక్కడ ఉన్నాను. మాటల్లో చెప్పలేనంత ప్రేమను మీరు నాపై చూపిస్తున్నారు. మీ అందరిపట్ల ఎప్పటికీ కృతజ్ఞతతో కలిగి ఉంటాను. తెలుగు వారందరికీ ధన్యవాదాలు.' అని తెలిపింది.
ఫ్యామిలీస్టార్ సినిమా గురించి మాట్లాడుతూ.. 'ఈ సినిమాలో 'ఇందు'గా మీ ముందుకు వస్తున్నాను. మొదటి 15 రోజులు ఈ పాత్ర చాలా ఇబ్బంది అనిపించింది. కానీ తర్వాత ఈ పాత్ర నాకన్నా ఎవరూ బాగా చేయలేరని అనిపించింది. విజయ్ దేవరకొండతో సినిమా చేయాలని ప్రతి హీరోయిన్ అనుకుంటుంది. కానీ ఫ్యామిలీస్టార్‌తో నాకు ఆ అవకాశం దక్కింది. అలాగే దిల్ రాజు గారితో ఇది నాకు రెండో సినిమా.. అవకాశం వస్తే మూడో సినిమా కూడా చేయాలని ఉంది. ఈ సినిమాను మా ఫ్యామిలీస్టార్ అయిన మా నాన్నగారికి డెడికేట్ చేస్తున్నాను.' అని మృణాల్ పేర్కొంది.
Taking Bow Head!!
— Telugu Bit (@telugubit) April 2, 2024
Thank you audiences, you all made me Telugu Ammai 😍
- #MrunalThakur #FamilyStar #VijayDeverakonda pic.twitter.com/faUXdZdUtz
Comments
Please login to add a commentAdd a comment