
షాపింగ్‌లో అభిరుచి... అవసరం..?
షాపింగ్ చేయడం ఒక కళ. ఏం కొంటున్నాం, ఎలాంటివి కొంటున్నామన్న విషయంలో స్పష్టంగా ఉండాలి.
సెల్ఫ్ చెక్
షాపింగ్ చేయడం ఒక కళ. ఏం కొంటున్నాం, ఎలాంటివి కొంటున్నామన్న విషయంలో స్పష్టంగా ఉండాలి. అయితే ఒక్కోసారి ముఖ్యంగా డ్రస్ విషయంలో మనకు తెలియకుండానే మార్కెట్ మాయాజాలంలోకి జారిపోతుంటాం. మన అవసరానికి అభిరుచిని జోడించి షాపింగ్ చేస్తున్నామా? ఒకసారి చెక్ చేసుకుందాం.
1. షాపింగ్ చేసేటప్పుడు డ్రస్ నచ్చితే ఇక ఇతర విషయాలను పరిగణనలోకి తీసుకోరు.
ఎ. కాదు బి. అవును
2. షాపింగ్‌లో భావోద్వేగాలకు లోనవుతుంటారని మీకు తెలుసు, కాని ఆ బలహీనత నుంచి బయటపడలేకున్నారు.
ఎ. కాదు బి. అవును
3. రకరకాల మోడల్స్‌లో ఖరీదైన దుస్తులు ఎన్ని ఉన్నా మీ బడ్జెట్‌ను, మీ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే కొనుగోలు చేస్తారు.
ఎ. అవును బి. కాదు
4. మీకు ఎటువంటి మోడల్స్æ, ఏ ఏ కలర్ నప్పుతాయో బాగా తెలుసు, కాబట్టి ఆచి తూచి సెలెక్ట్ చేసుకుంటారు.
ఎ. అవును బి. కాదు
5. డ్రస్ మీకు నప్పడం కంటే నచ్చడమే ముఖ్యం అనుకుంటారు. కాబట్టి వాటిని వేసుకున్నాక ఎవరైనా నప్పలేదంటే బాధపడరు. నాకు నచ్చినది నేను వేసుకుంటున్నానని తృప్తిగా ఫీలవుతారు.
ఎ. అవును బి. కాదు
6. కొనాలన్న ఆలోచన లేకున్నప్పటికీ షోరూముల కెళ్లి రకరకాల డ్రస్‌లను ట్రయల్ వేసుకోవడం మీకు సరదా.
ఎ. కాదు బి. అవును
7. దుస్తులు కొనేటప్పుడు ఫ్యాషన్‌తోపాటు మన్నికను కూడా ఆలోచిస్తారు.
ఎ. అవును బి. కాదు
8. మూడ్ బాగున్నప్పుడు మాత్రమే షాపింగ్ చేయాలని మీకు తెలుసు.
ఎ. అవును బి. కాదు
9. ఒక గంట లేక అరగంట అని నిర్ణీత సమయంలోనే హడావుడిగా కొంటే చక్కటి సెలెక్షన్‌కు అవకాశం ఉండదని తెలుసు. ప్రశాంతంగా సమయం కేటాయించగలిగినప్పుడే వెళతారు.
ఎ. అవును బి. కాదు
10. షాపింగ్‌కెళ్లేటప్పుడు మనం వేసుకున్న డ్రస్ కూడా ప్రభావం చూపుతుంది కాబట్టి నీట్‌గా వెళతారు.
ఎ. అవును బి. కాదు
సమాధానాల్లో ‘ఎ’లు ఏడు అంతకంటే ఎక్కువగా వస్తే మీ అవసరానికి అభిరుచిని మేళవించి కొనుగోలు చేయడంలో పరిణతి చెందారనవచ్చు. ‘బి’లు ఎక్కువగా వస్తే షాపింగ్‌లో మీరు అనుసరిస్తున్న మెళకువలకు మరికొన్ని జోడిస్తే ఇంకా బాగుంటుంది. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నట్లు అనిపిస్తే, ఒకటి, రెండు ప్రశ్నల ప్రభావం మీమీద ఎక్కువగా ఉంటే అనవసరమైన వాటిని కొనకుండా మిమ్మల్ని ఆపగలిగే వాళ్లను తోడు తీసుకెళ్లడం అలవాటు చేసుకోండి.