ఆ లేడీస్ డ్రెస్ చూసి అంతా షాక్! | Londoneers were shocked when they saw 9/11 attacks dress | Sakshi
Sakshi News home page

ఆ లేడీస్ డ్రెస్ చూసి అంతా షాక్!

Published Wed, Oct 5 2016 6:59 PM | Last Updated on Mon, Sep 4 2017 4:17 PM

ఆ లేడీస్ డ్రెస్ చూసి అంతా షాక్!

ఆ లేడీస్ డ్రెస్ చూసి అంతా షాక్!

మహిళలు ధరించే ఒక రకం డ్రెస్.. లండన్ వాసులను కలవరపాటుకు గురిచేసింది. చివరికి షాప్ ఓనరే ఆ డ్రెస్ ను తగలబెట్టాడు..

లండన్: మహిళలు ధరించే ఒక రకం డ్రెస్.. లండన్ వాసులను కలవరపాటుకు గురిచేసింది. నగరంలోని పొప్లార్ అనే ప్రాంతంలో గల స్ట్రీట్ మార్కెట్ లో కొలువైన ఓ బట్టల షాపులో 9/11 ఉగ్రదాడులను సూచించే టాప్ ఒకటి పదర్శనకు ఉంచారు. మార్కెట్ సమీపంలో నివసించే 17ఏళ్ల బాలుడు ఆ టాప్ ను ఫొటోతీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అదికాస్తా వైరల్ అయిది. ఎక్కడెక్కడివాళ్లంతా ఆ వస్త్రదుకాణానికి వచ్చి టాప్ ను చూడటం మొదలుపెట్టారు.

సమాచారం తెలుసుకున్న మీడియా అసలు విషయాన్ని వాకబుచేయగా..'అసలా టాప్ పైన ట్విన్ టవర్స్ కాలిపోతున్న బోమ్మ ఉన్నట్లు గుర్తించనేలేద'ని షాప్ యజమాని వాపోయాడు. హోల్ సేలర్ నుంచి తీసుకొచ్చిన దుస్తుల్నే అమ్ముతున్నానని చెప్పాడు. సదరు హోల్ సేలర్ తోపాటు దుస్తులు తయారుచేసిన కంపెనీని సంప్రదించగా.. అలాంటి(9/11) మోడల్ దుస్తులను తాము తయారుచేయలేదని, స్టాక్ లో ఎలా కలిసిపోయిందో తెలియదని సమాధానమిచ్చారు. చివరికి ఆ షాప్ ఓనరే ఈ టాప్ ను తగలబెట్టడంతో కథనం ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement