భార్యల్ని పొట్టిబట్టల్లో చూసి మురిసిపోతారా? హవ్వా!! | Biggboss Fame former actress Sana Khan contorversial comments on wifes skimpy clothes | Sakshi
Sakshi News home page

భార్యల్ని పొట్టిబట్టల్లో చూసి మురిసిపోతారా? హవ్వా!!

Published Sat, Sep 21 2024 12:47 PM | Last Updated on Sat, Sep 21 2024 3:18 PM

Biggboss Fame former actress Sana Khan contorversial comments on  wifes skimpy clothes

అపుడు నాకేదో దెయ్యం పట్టింది అందుకే అలాంటి బట్టలు వేసుకున్నా! హీరోయిన్ సనా ఖాన్

తప్పు తెలుసుకున్నా, ఇపుడు సిగ్గుపడుతున్నా! హీరోయిన్ సనా ఖాన్

పొట్టి బట్టల్లో భార్యల్ని చూసి మురిసిపోతారా, ఏమైంది వీళ్లకు?

బిగ్‌ బాస్‌-6 ఫేమ్‌, హీరోయిన్ సనా ఖాన్ గుర్తుందా. హాట్ గ్లామరస్ రోల్స్ మాత్రమేచేస్తూ చిట్టి పొట్టి దుస్తుల్లో అందాలు ఆరబోసిన సనాఖాన్‌  తాజాగా మహిళల వస్త్రధారణపై   సంచలన వ్యాఖ్యలు చేసింది.   భార్యలు చిన్న దుస్తులు వేసుకోవడానికి భర్తలు ఎలా అనుమతిస్తారు అంటూ ప్రశ్నలు వేస్తోంది. అంతేకాదు ఆ సమయంలో తనకేదో దెయ్యం పట్టింది, అందుకే తన సినిమాల్లో ఆధునికత పేరులో పిచ్చి బట్టలు వేసుకున్నాను, ఇపుడు సిగ్గుపడుతున్నాను అంటూ వ్యాఖ్యానించడం నెటిజన్లను ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

రుబీనా దిలైక్‌తో  నిర్వహించిన పోడ్‌కాస్ట్‌లో సనాఖాన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సైతాన్‌ కారణంగానే సింప్లిసిటీకి బదులు మోడ్రన్‌ దుస్తులు, సల్వార్-కమీజ్‌పై స్లీవ్‌లెస్ ధరించేలా చేసిందని, తన జీవితంలో అదొక అధ్వాన్నమైన  సమయమని చెప్పింది. ప్రస్తుతం తప్పు ఏంటో తెలుసుకున్నా, సిగ్గుపడుతున్నా అని  పేర్కొంది. అంతేకాదు ప్రతీ పురుషుడు తన భార్య నిరాడంబరంగా దుస్తులు ధరించాలని కోరుకుంటాడు, కానీ కొంతమంది ఎక్స్‌పోజింగ్‌ దుస్తులు వేసుకునేలా భార్యల్ని,ఎందుకు ప్రోత్సహిస్తారో అర్థం కాదని వాపోయింది.  ‘ఆమె నీ భార్య కొంచెమైనా ఆత్మగౌరవం ఉండాలంటూ’ హితవు పలకడం గమనార్హం. 

కాగా  బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్‌తో ‘జై హో’, టాలీవుడ్‌లో కళ్యాణ్‌రామ్‌తో ‘కత్తి’, నాగార్జునతో ‘గగనం’, మంచు మనోజ్‌తో ‘మిస్టర్ నూకయ్య’  సినిమాల్లో నటించింది సనాఖాన్‌. రియాల్టీ షో బిగ్ బాస్ 6లో కూడా హల్‌ చల్‌ చేసింది.  2019 తర్వాత సనా ఖాన్ పూర్తిగా సినిమాలకు దూరమైపోయింది.  ఆ తర్వాత  నవంబర్ 2020 నవంబరులో ముస్లిం మతగురువు, వ్యాపారవేత్త అనాస్ సయ్యద్‌ని పెళ్లి చేసుకుని అందర్నీ దిగ్భ్రాంతికి గురించింది.  2023లో ఓ బిడ్డకు జన్మనిచ్చింది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement