ఆ ఊరిలోని మహిళలు ఏడాదిలో ఐదు రోజులు దుస్తులు లేకుండా.. | Women Still Don't Wear Clothes For 5 Days In This Indian Village; Reason Will Surprise You - Sakshi
Sakshi News home page

ఆ ఊరిలోని మహిళలంతా ఐదు రోజులు దుస్తులు లేకుండా ఎందుకుంటారో తెలిస్తే..షాకవ్వుతారు!

Published Wed, Oct 4 2023 2:09 PM | Last Updated on Wed, Oct 4 2023 5:20 PM

Women Of This Village Do Not Wear Clothes For 5 Days - Sakshi

కొన్ని ఊర్లలో చాలా వింతైనా ఆచారాలు ఉంటాయి. వింటేనా చాలా వింతగా ఆశ్చర్యంగా ఉంటాయి. అచ్చం అలానే ఇక్కడొక ఊరిలా ఓ వింత ఆచారం ఉంది. అది వింటే ఒక్కసారిగా నిర్ఘాంతపోతారు. బాబోయ్‌ ఇదేమి ఆచారం రా బాబు అనేస్తారు. అంత వింతగా జుగుప్సకరంగా ఉంటుంది. 

వివరాల్లోకెళ్తే..హిమాచల్‌ప్రదేశ్‌లోని కులు జిల్లాలోని సుందరమైన ప్రకృతి ఒడిలో పిని అనే ఓ గ్రామం ఉంది. ఇది సాంప్రదాయ జీవన విధానానికి చాలా ప్రసిద్ధి. ఉత్కంఠభరితమైన ప్రకృతి దృశ్యాల మధ్య ఈ గ్రామంలో ఉత్సుకతను రేకెత్తించే ఓ విచిత్రమైన సంప్రదాయం ఉంది. ఆ పిని గ్రామంలో మహిళలంతా స్వచ్ఛందంగా ఏడాదిలో ఒక  ఐదు రోజుల పాటు దుస్తులు ధరించడం మానేస్తారు. ఇది తరతరాలుగా వస్తున్న ఆచారం కూడా. 

ఎందుకిలా అంటే?..
గ్రామస్తులు ప్రకృతికి, స్థానిక దేవత పట్ల ప్రగాఢమైన గౌరవం, కృతజ్ఞతకి గుర్తుగా ఇలా చేస్తారట. ఐదురోజుల పాటు బట్టలు లేకుండా ప్రకృతితో గడుపుతరట. తమ గ్రామంలోని స్త్రీలు సూర్యుని కాంతి, వెలుగు, స్వచ్ఛమైన గాలిని తమ మేనిపై స్వాగతించేలా ప్రకృతిని ఆలంగినం చేసుకుంటారని అక్కడ గ్రామస్తులు చెబుతుండటం విశేషం. ఈ సంప్రదాయం వెనుకు ఉన్న ప్రధాన కారణం తమ స్థానిక దేవతకు నివాళులర్పించేందుకు ఇలా స్త్రీలు వివస్త్రగా ఉంటారట.

ఇలా తమను తాము శుద్ధి చేసుకోవడమే గాక తమ కుటుంబాన్ని, గ్రామాన్ని చల్లగా చూడమని దేవతను కోరుతూ.. ఇలా బట్టలు విప్పి తమ గౌరవాన్ని చాటుకుంటారట. ఈ ఐదు రోజులూ పిని గ్రామంలోని మహిళలు బట్టలు లేకుండానే వివిధ పూజలు, వేడుకల్లో పాల్గొంటారు. వారు గ్రామ దేవత ఆలయాన్ని సందర్శించి ప్రార్థనలు చేస్తారు. ఈ ఐదు రోజులు వారికి గొప్ప ఆధ్యాత్మికతకు సంబంధించి ఒక భక్తి మార్గం అని చెప్పాలి.

అంతేగాదు దుస్తులు దైవంతో అనుబంధం ఏర్పరుచుకోవడానికి అవరోధంగా అక్కడ మహిళలు భావిస్తారట కూడా. నిజమే కదా! ఆధ్యాత్మికపరంగా ఆలోచిస్తే మనల్ని సృష్టించిన భగవంతుడు ముందు సిగ్గు, బిడియం ఉండకూదు. మనం చిన్నగా ఉన్నప్పుడూ మన తల్లిదండ్రలు వద్ద ఎలా ఉంటామో అలానే భగవంతుడితో ఉండాలని చెప్పకనే చెబుతున్నారు వీళ్లు. 

(చదవండి: అరుదైన అలెర్జీ..! సాక్షాత్తు వైద్యురాలే ఐనా..)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement