ఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సమయం ఆసన్నమైంది. దేశవ్యాప్తంగా వేడుకలకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. దేశ రాజధానిలో నేడు సైనిక దళాల డ్రస్ రిహార్సల్స్ జరుగుతున్నాయి. ఈ మేరకు ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు అధికారులు. స్వాతంత్య్ర వేడుకలకు దేశ రాజధానిలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఆగష్టు 15న జరగనున్న వేడుకలకు వివిధ సైనిక దళాలు నేడు ఎర్రకోట వద్ద డ్రెస్ రిహార్సల్స్ చేస్తున్నాయి. 77 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని మోదీ ఇక్కడ నుంచే ఉపన్యాసం ఇవ్వనున్నారు. డ్రెస్ రిహార్సల్‌కు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు.
#WATCH | Ahead of Independence Day, full dress rehearsal of different armed forces under way at Red Fort in #Delhi
— TOI Delhi (@TOIDelhi) August 13, 2023
(ANI) pic.twitter.com/84euGIuIe7
ఆగష్టు 15న ఎలాంటి ఇబ్బందులు తెలత్తకుండా మొత్తం కార్యక్రమాన్ని ముందే రిహార్సల్స్ చేస‍్తున్నారు. వివిధ మార్గాల్లో ట్రాఫిక్ నిబంధనలు విధించారు. రిహార్సల్స్ జరిగే మార్గాల్లో వాహనాలు రాకుండా దారి మళ్లించారు. నోయిడా నుంచి వచ్చే ప్రయాణికులకు వేరే మార్గాలను సూచించారు. ఎర్రకోట మార్గంలో ఉదయం 4 గంటల నుంచి 11 గంటల వరకు రాకపోకలను నిలిపివేశారు.
Traffic Advisory
— Delhi Traffic Police (@dtptraffic) August 12, 2023
In view of #IndependenceDay Full Dress Rehearsal on August 13, 2023, #DelhiTrafficPolice advises commuters to avoid these roads and take alternate routes at the mentioned timings. pic.twitter.com/5oAxPbkjkR
యూపీలోనూ వర్కింగ్ డే..
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సన్నాహాలు చేసుకోవడానికి ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వం పాఠశాలలకు ఆదివారం వర్కిండే డే అని ప్రకటించారు. హర్ గర్ తిరంగ, మేరీ మాత మేరీ దేశ్ కార్యక్రమంలో భాగంగా ఆగష్టు 15 వేడుకల కోసం స్కూళ్లకు ఆదివారం సెలవును రద్దు చేశారు. డుస్తుంది.
ఆదివారం సెలవు అయినప్పటికీ నేరుగా అధికార వర్గాలు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశాయి. విద్యార్థులు పాఠశాలలకు యధావిథిగా వచ్చి.. వేడుకల్లో పాలు పంచుకుంటారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో నేడు మధ్యాహ్నం భోజనం స్కీం కూడా నడుస్తుంది.
ఇదీ చదవండి: మోదీ దేశానికి రాజు కావాలనుకుంటున్నారు
Comments
Please login to add a commentAdd a comment