'ప్రపంచంలోనే తొలి ఏఐ డ్రెస్‌'! | Google Engineer Makes Worlds First AI Dress | Sakshi
Sakshi News home page

'ప్రపంచంలోనే తొలి ఏఐ డ్రెస్‌'!..ఏకంగా రోబోటిక్‌ పాములతో..

Published Wed, Jul 3 2024 10:55 AM | Last Updated on Wed, Jul 3 2024 12:27 PM

Google Engineer Makes Worlds First AI Dress

ఏఐ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతూ శరవేగంగా దూసుకుపోతోంది. రోబోల దగ్గర నుంచి స్మార్ట్‌ ఫోన్‌ల వరకు ప్రతి రంగంలో దీని సాంకేతికను వినియోగిస్తున్నారు. యావత్తు ప్రపంచం దృష్టి ఈ టెక్నాలజీ పైనే ఉంది. ఇప్పుడు అలానే తాజాగా ఏఐ సాంకేతికతో కూడిన దుస్తులు మన మందుకు వచ్చాయి. బహుశా ప్రపంచంలోనే తొలి ఏఐ దుస్తులు ఇవే. దీన్ని రూపొందించింది గూగుల్‌ ఇంజనీర్‌ క్రిస్టినా ఎర్నెస్ట్‌. ఈమె SheBuildsRobots.org వ్యవస్థాపకురాలు. ఈ వెబ్‌సైట్‌ సాయంతో రోబోట్‌లు రూపొందించడంపై బాలికలకు అవగాహన కల్పిస్తుంది క్రిస్టినా. 

ఆమె ఈ ఏఐ డ్రెస్‌ని రోబోటిక్‌ పాములను జోడించి మరి రూపొందించింది. ఇది "మెడుసా డ్రెస్‌"గా పిలిచే నలుపు రంగులో ఉంటుంది. ఈ డ్రెస్‌ ధరించి మరీ చూపించింది. అదెలా ఉంటుందంటే..ఆమె మెడ చుట్టూ పెద్ద రోబోటిక్‌ పాము ఉంటుంది. అలాగే నడుము చ్టుట్టూతా కూడా మూడు బంగారు రంగు పాములు ఉంటాయి. ఈ రోబోటిక్‌ స్నేక్‌ డ్రెస్‌ని ముఖాలను గుర్తించేలా రూపొందించినట్లు తెలిపింది. మనల్ని చూస్తున్న​ వ్యక్తి వైపుకి పాము తల తిప్పి చూసేలా కృత్రిమ మేధస్సుతో కోడింగ్‌ చేశానని తెలిపింది క్రిస్టినా. ఇలాంటి ఏఐ ‍డ్రెస్‌ ప్రపంచంలోనే మొట్టమొదటిది అయ్యి ఉండొచ్చని పేర్కొంది.  

అలాగే ఈ డ్రెస్‌ని రూపొందించడానికి తాను ఎలాంటి ప్రయోగాలు చేశాను, ఎన్ని సార్లు విఫలమయ్యిందో కూడా వివరించింది క్రిస్టినా. అందుకు సంబందించిన వీడియోను నెటిజన్లతో షేర్‌ చేసుకున్నారు. ఈ వీడియోకి ఏకంగా లక్షకు పైగా లైక్‌లు, రెండు మిలియన్లకు పైగా వ్యూస్‌ వచ్చాయి. ఇక క్రిస్టినా తాను ఇంజనీర్‌ అయినా ఫ్యాషన్‌ మీద ఇష్టంతోనే ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టినట్లు తెలిపారు. ఈ రకమైన ప్రాజెక్టు చేసేటప్పుడే ఎంత శ్రమ, సమయం, డబ్బు అవసరమవుతాయో కూడా తెలుసుకోగలిగానని అన్నారు క్రిస్టినా. నెటిజన్లు కూడా చాలా బాగా చేశారు. ఇది అద్భుతం, స్పూర్తిదాయకం అంటూ క్రిస్టినాపై ప్రశంసల జల్లు కురిపిస్తూ పోస్టులు పెట్టారు.  

 

(చదవండి: సరికొత్త ఫిట్‌నెస్‌ మంత్ర..సెవెన్‌ సెకండ్‌ కాఫీ ట్రెండ్‌..!)
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement