ప్రముఖ టెక్ దిగ్గజం అడోబీ అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో ‘అడోబీ యాన్యువల్ మ్యాక్స్ కాన్ఫిరెన్స్ నిర్వహించింది. అక్టోబర్ 10 నుంచి 12 వరకు మూడు రోజుల పాటు జరిగిన ఈ కాన్ఫరెన్స్ కొత్త కొత్త ఆవిష్కరణలకు వేదికగా నిలిచింది.
ఈ ఏడాది ఎలాంటి అంచనాలు లేకుండా అక్టోబర్ 10 ప్రారంభమైన ఈ కాన్ఫరెన్స్‌లో అడోబీ సంస్థ సుమారు 11 కొత్త ఏఐ ఆధారిత ప్రోటో టైప్ టూల్స్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది.
స్నీక్ పేరుతో నిర్వహించిన ఈవెంట్‌లో వీడియో అప్‌స్కేలర్, ప్రాజెక్ట్ స్టార్డస్ట్‌లు హైలెట్‌గా నిలిచాయి.ముఖ్యంగా ఆబ్జెక్ట్-అవేర్ ఎడిటింగ్ ఇంజన్ ఏఐ టూల్ సాయంతో ఫోటోల్లో అనవసరమైన వస్తువుల్ని తొలగించడం కావాల్సిన వాటిని జత చేయొచ్చు.
దీంతో పాటు ప్రాజెక్ట్ ప్రింరోస్ చూపురులను వీపరితంగా ఆకట్టుకుంది. ‘ఫ్లెక్సిబుల్ టెక్స్‌టైల్ డిస్‌ప్లే’లో భాగంగా అడోబీ కంపెనీ ప్రత్యేకంగా డిజైన్ చేసిన దుస్తుల డిజైన్‌లు మారిపోడంతో పాటు నచ్చిన చిత్రాల్ని సైతం వీక్షించొచ్చు. ఇప్పటికే అడోబీ స్మార్ట్ డిస్‌ప్లే ఫాబ్రిక్ టెక్నాలజీని గతంలోనే పరిచయం చేసింది. కానీ ఇప్పుడు ఈ సాంకేతికలో ఏఐని జోడించింది. అందంగా తీర్చిదిద్దింది.
Comments
Please login to add a commentAdd a comment