
ఇన్ని రంగులు కంగనా మీద చూస్తే
మరి కంగుమనదా హృదయం.
కంగేంటి ఖర్మ యంగ్‌మనదా హృదయం.
ఈ డ్రెస్సులలో మీరు కూడా యంగ్‌రంగుల చెంగుచెంగులు కొట్టండి.
ఆహా.. కంగుమనదా హృదయం.
►వెల్వెట్ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన లెహంగా, ఫుల్ స్లీవ్స్ బోట్‌నెక్ బ్లౌజ్ వీటి మీద గ్రాండ్‌గా తీర్చిదిద్దిన ఎంబ్రాయిడరీ... వేడుకను వైబ్రెంట్‌గా మారుస్తుంది.
►లేత గులాబీ రంగు ఫ్రాక్ క్యాజువల్ వేర్‌గా అమరే వెస్ట్రన్ స్టైల్. ఇది గెట్ టు గెదర్ వంటి వెస్ట్రన్ పార్టీలకు కంఫర్ట్‌గా ఉండటంతో పాటు లుక్ అట్రాక్టివ్‌గా ఉంటుంది.
►లేత గులాబీ రంగు జార్జెట్ శారీ, స్లీవ్‌లెస్ బ్లౌజ్ మీదకు సిల్వర్ జ్యువెల్రీ ధరిస్తే సింపుల్‌గా, స్టైలిష్‌గా కనిపిస్తారు.
► బ్లాక్ జార్జెట్ లాంగ్ ఫ్రాక్ ఇది. బ్లాక్ డ్రెస్ ధరిస్తే ఆభరణాలు, ఇతర అలంకరణలు అవసరం లేకుండానే ఎక్కడ ఉన్నా హైలైట్‌గా నిలిచిపోతారు. ముఖ్యంగా ఈవెనింగ్
పార్టీస్‌కి ఈ డ్రెస్ బెస్ట్ ఆప్షన్
►సైడ్ స్లిట్ గల ప్రింటెడ్ లాంగ్ కుర్తీ, బాటమ్‌గా పలాజో క్యాజువల్ వేర్‌గా ఇలాంటి డ్రెస్సులు బాగా నప్పుతాయి.
► లాంగ్ ఫ్రాక్ దానికి బాటమ్‌గా పలాజో డిఫరెంట్ స్టైల్‌ని కళ్లకు కడుతుంది.
►లేత గులాబీ రంగు ప్రింటెడ్ సింగిల్ షోల్డర్ కేప్, బాటమ్‌గా ప్యాంట్.. వెస్ట్రన్ పార్టీలో వినూత్నంగా కనిపిస్తారు.
►లేయర్డ్ లాంగ్ ఫ్రాక్. ఒకే రంగుతో అట్రాక్ట్ చేసే విధంగా ఉన్న ఇలాంటి డ్రెస్సింగ్ పెద్ద పెద్ద ఈవెనింగ్ ఇవెంట్స్‌కు బాగా నప్పుతుంది.
- భార్గవి కూనమ్ ఫ్యాషన్ డిజైనర్
Comments
Please login to add a commentAdd a comment