ఖరీదైన డ్రెస్‌లో మెరిసిన తమన్నా.. ధర తెలిస్తే కళ్లు తిరుగుతాయ్ | Shocking Price Of Actress Tamannaah Summer Fashion Dress Goes Viral | Sakshi
Sakshi News home page

ఖరీదైన డ్రెస్‌లో మెరిసిన తమన్నా.. ధర తెలిస్తే కళ్లు తిరుగుతాయ్‌

Published Sat, Apr 10 2021 6:37 PM | Last Updated on Sun, Apr 11 2021 3:39 PM

Shocking Price Of Actress Tamannaah Summer Fashion Dress Goes Viral - Sakshi

ఒకప్పుడు ఫ్యాషన్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేకత ఏర్పరుచుకున్న తమన్నా .. చిన్న వయస్సులోనే సినిమాల్లో ఛాన్సులు కొట్టేసిన సంగతి తెలిసిందే. తొలి సినిమా ‘శ్రీ’తో టాలీవుడ్‌కి పరిచయడం అయింది ఈ మిల్కీబ్యూటీ. మంచు మనోజ్‌ హీరోగా నటించిన ఆ సినిమా ఆశించినంత విజయం సాధించలేదు. కానీ తమన్నాకు మాత్రం వరుస ఆఫర్లను తెచ్చిపెట్టింది.

2007లో శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘హ్యాపీడేస్‌’తో తమన్నాకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత కొంచెం ఇష్టం కొంచెం కష్టం, 100% లవ్‌, రచ్చ, బాహుబలి చిత్రాలతో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. ప్రస్తుతం ఈ బ్యూటీ సినిమాలతో పాటు పలు వెబ్‌ సిరీస్‌ల్లో నటిస్తుంది. తాజాగా తమన్నా నటించిన 11th అవర్ అనే వెబ్ సీరీస్‌ ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్‌ అవుతుంది. 

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ బ్యూటీ ధరించిన డ్రెస్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. తాజాగా ఈ మిల్కీబ్యూటీ.. లేత గులాబీ రంగులోని పర్పుల పువ్వుల ఫ్రాక్‏లో అందంగా ముస్తాబైంది. ఆ డ్రెస్‌లో ఉన్న ఫోటోలని, వీడియోని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. అంతే ఇక నెటిజన్ల చూపులన్నీ ఆ డ్రెస్‌ మీదే పడ్డాయి.

ముఖ్యంగా అమ్మాయిలు అయితే.. వారెవ్వా తమన్నా.. ఆ డ్రెస్ మా సొంతమైతే ఎంత బాగుంటుందని తెగ ఫీలైపోతున్నారు. ఎందుకంటే అది సాదాసీదా ఫ్రాక్‌ కాదండోయ్. అత్యంత ఖరీదైన ప్రాక్‌. దీని ధర తెలిస్తే కళ్లు తిరుగుతాయ్.  ఆ ఫ్రాక్ ధర అక్షరాల 51,244 రూపాయలట. దీనిని ప్రముఖ స్టైలిస్ట్ సుకృతి గ్రోవర్ రూపొందించింది. ప్రస్తుతం తమన్నా ధరించిన డ్రెస్ ఖరీదు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‏గా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement