పట్నా: ఓ పోటీ పరీక్షకు నిబంధనలకు విరుద్ధంగా ఫుల్ స్లీవ్ దుస్తులు ధరించి హాజరైన యువతుల దుస్తుల్ని కత్తెరలు, బ్లేడులతో కత్తిరించిన ఘటన బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో చోటుచేసుకుంది. విద్యార్థినుల దుస్తుల్ని చింపివేస్తున్న వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారడంతో సంబంధిత పరీక్షా కేంద్రంతో పాటు పరీక్ష సూపరింటెండెంట్‌పై జీవితకాలం వేటుపడింది. బిహార్ కంబైన్డ్ ఎంట్రన్స్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ బోర్డు(బీసీఈసీఈబీ) శనివారం నర్సింగ్ కోర్సు ప్రవేశపరీక్షను నిర్వహించింది. స్లీవ్‌లెస్ దుస్తుల్ని ధరించాలని అభ్యర్థులకు సూచించింది. ముజఫర్‌పూర్ జిల్లాలో పలువురు యువతులు ఫుల్‌స్లీవ్ దుస్తులు ధరించి హాజరయ్యారు. దీంతో పరీక్షా కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది, ఇన్విజిలేటర్లు యువతుల స్లీవ్స్‌ను కత్తిరించారు. ఈ ఘటనపై బిహార్ విద్యాశాఖ విచారణకు ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment