
శ్రీలీల.. తెలుగు ప్రేక్షకుల మైండ్‌లో రిజిస్టర్ అయిన పేరు.. హార్ట్‌లో ప్రింట్ అయిన రూపు!. మన హద్దుల్లో మనం ఉంటే ఏ ఇబ్బందీ ఉండదు చిత్ర పరిశ్రమ అనేది గౌరవనీయమైన ఇండస్ట్రీనే. హీరోయిన్ అవ్వాలనుకునే తెలుగమ్మాయిలకు నేను ఇచ్చే సలహా ఇదే అని అంటోంది ముద్దగుమ్మ శ్రీలీల. ‘పెళ్లిసందడి’తో తెరంగేట్రం చేసిన ఆమె అటు సినిమాలతో ఇటు తన ఫ్యాషన్ స్టయిల్‌తో అభిమానులను అలరిస్తోంది. శ్రీలీల వార్డ్ రోబ్‌లోని ఫ్యాషన్ బ్రాండ్స్‌లో ఒకట్రెండు ఇక్కడ..
నితికా గుజ్రాల్..
చాలామంది సెలబ్రిటీస్‌కి ఇది ఇష్టమైన బ్రాండ్. ముంబైకి చెందిన నితికా అతి చిన్న వయసులోనే టాప్ మోస్ట్ ఫ్యాషన్ డిజైనర్‌గా ఎదిగింది. అల్లికలు, కుందన్ వర్క్స్‌తో అందమైన డిజైన్స్ రూపొందించడంలో ఆమెది ప్రత్యేక ముద్ర. ఈ డిజైన్స్‌కి విదేశాల్లోనూ మంచి డిమాండ్ ఉంది. అయితే వీటి ధర లక్షల్లోనే ఉంటుంది. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయొచ్చు. శ్రీలీల ధరించిన నితికా గుజ్రాల్ ధర రూ. 72,500/-
మంగత్రాయ్ జ్యూయెల్స్..
అతి ప్రాచీన, ప్రసిద్ధ జ్యూలరీ బ్రాండ్స్‌లో మంగత్రాయ్ జ్యూయెల్స్ ఒకటి. 1905లో చంగల్ లాల్ గుప్తా, అతని కుమారుడు దర్పణ్ గుప్తా కలసి ఈ బంగారు అభరణాల వ్యాపారాన్ని ప్రారంభించారు. సంస్కృతి, సంప్రదాయ డిజైన్స్ తోపాటు ఆధునిక డిజైన్స్ కూడా ఇక్కడ లభిస్తాయి. ప్రతి ఆభరణాన్ని అత్యంత నైపుణ్యం కలిగిన హస్తకళాకారులు తయారు చేస్తారు. అదే వీరి ప్రత్యేకత. ధర ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. పలు ప్రముఖ నగరాలతో పాటు ఆన్‌లైన్‌లోనూ లభ్యం.
--దీపిక కొండి
Comments
Please login to add a commentAdd a comment