Ram Charan Shirt Cost Goes Viral Which He Wore On His 38th Birthday - Sakshi
Sakshi News home page

Ram Charan: వైరల్‌గా మారిన చరణ్‌ బర్త్‌డే షర్ట్‌ కాస్ట్‌.. షాకవుతున్న నెటిజన్స్‌!

Published Tue, Mar 28 2023 2:20 PM | Last Updated on Tue, Mar 28 2023 4:52 PM

Ram Charan Shirt Cost Goes Viral Which He Wore on his 38th Birthday - Sakshi

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ తన పుట్టిన రోజును సినీ ప్రముఖుల మధ్య గ్రాండ్‌గా సెలబ్రెట్‌ చేసుకున్నాడు. మార్చి 27తో చరణ్‌ 38వ వసంతంలోకి అడుగు పెట్టాడు. సోమవారం రాత్రి జరిగిన చరణ్‌ బర్త్‌డే పార్టీలో టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు, డైరెక్టర్స్‌ పాల్గొని సందడి చేశారు. ఇక చరణ్‌ బర్త్‌డే సందర్భంగా RC15 నుంచి వరుస అప్‌డేట్స్‌ వదిలారు మేకర్స్‌.

చదవండి: బిగ్‌బాస్‌ అలీ రేజాతో రొమాంటిక్‌ సీన్‌పై ప్రశ్న.. నటి సనా షాకింగ్‌ రియాక్షన్‌

చరణ్‌ పుట్టిన రోజు సందర్భంగా విషెస్‌ చెబుతూ మెగాస్టార్‌ చిరంజీవి తనయుడిని ముద్దాడుతూ ఓ ఫొటో షేర్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇక టాలీవుడ్‌ సినీ ప్రముఖులు సైతం స్వయంగా ఇంటికి వెళ్లి చరణ్‌కి శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో చరణ్‌ ధరించిన లైట్‌ బ్లూ షర్ట్‌పై అందరి దృష్టి పడింది. బర్త్‌డే సందర్భంగా చరణ్‌ వేసుకున్న ఆ షర్ట్‌ స్పెషాలిటీ, బ్రాండ్‌ ఏంటి? అని ఫ్యాన్స్‌ ఆరా తీయగా దాని ధర తెలిసి అంతా అవాక్కవుతున్నారు.

చదవండి: తొలిసారి బేబీ బంప్‌తో ఉపాసన.. ఫొటోలు వైరల్‌

దీంతో చరణ్‌ షర్ట్‌ కాస్ట్‌ వైరల్‌గా మారింది. కాగా ఈ షర్ట్ గురించి ఆన్‌లైన్‌లో సెర్చ్‌ చేయగా ఇది ఫార్‌ ఫేచ్‌ అనే ఫారిన్‌ షాపింగ్‌ వెబ్‌సైట్లో అందుబాటులో ఉన్నట్లు కనిపించింది.  జాన్యా వటనాబి ప్యాచ్‌ వర్క్‌తో డిజైన్‌ చేసిన ఈ షర్ట్‌ను డీటైల్‌ అని పిలుస్తారు. ఇక ఈ వెబ్‌ సైట్‌ ప్రకారం.. ఈ షర్ట్‌ ధర 983 డాలర్లు ఉన్నట్లు తెలుస్తోంది. అంటే భారత కరెన్సీ ప్రకారం 80,961 రూపాయలు. ఇది తెలిసి అంతా షాక్‌ అవుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement