ఆమె డ్రెస్ చూసి మహిళలు దాడి చేశారు!
పొట్టి దుస్తులు ధరించి స్నేహితురాలి వివాహానికి వెళ్లిన ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. ఆ పెళ్లికి వచ్చిన కొందరు మహిళలు.. ఆమెపట్ల అమర్యాదగా ప‍్రవర్తించి దాడికి దిగారు. అయితే.. ఇందులో తన తప్పేం లేదని.. తాను ధరించిన దుస్తులు ప్రస్తుత సమాజంలో అందరు మహిళలు ధరించేవే అని ఆమె సోషల్ మీడియాలో తన గోడు వెల్లబోసుకుంది.
ఫిట్నెస్ ట్రైనర్, న్యూట్రీషియన్ అయిన లిజ్ క్రూగర్.. తను హాజరైన పెళ్లి వేడుకలో మహిళల ప్రవర్తన గురించి ఇన్స‍్టాగ్రామ్లో తెలిపింది. అక్కడ కొందరు తనపై బీర్ పోసి మరీ అమమానించారని పేర్కొంది. అయితే.. ఎవరైనా కొత్త మహిళలు తారసపడినప్పుడు అకారణంగా వారిని ద్వేషించకుండా మహిళలు ఒకరికొకరు సహకరించుకోవాలని చెబుతూ.. 'క్రూగర్ కైండ్నెస్' పేరుతో ప్రచారం నిర్వహిస్తోంది. సోషల్ మీడియాలో పలువురు మహిళలు క్రూగర్కు మద్దతుగా నిలిచారు. ఆమెపై జరిగిన దాడి అమానుషం అంటూ క్రూగర్ కైండ్నెస్ ప్రచారంలో గొంతుకలిపారు.