Shriya Saran Risks Dress Open, Gets Viral Trolled - Sakshi
Sakshi News home page

Shriya Saran: డ్రెస్‌ కవర్‌ చేసుకోలేక ఇబ్బంది పడ్డ శ్రియా.. వైరల్‌ అయిన వీడియో

Published Sun, Jun 25 2023 2:57 PM | Last Updated on Wed, Jun 28 2023 11:17 AM

Shriya Saran Risks Dress Open Gets Viral Trolled - Sakshi

సీనియర్ బ్యూటీ శ్రియ శరన్‌  గురించి పరిచయం అవసరం లేదు. దాదాపు ఇరవై యేళ్లుగా టాలీవుడ్‌లో తనదైన అందం నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూనే ఉంది. ఒక బిడ్డకు తల్లైన తర్వాత కూడా తన గ్లామర్ విషయంలో ఎలాంటి హద్దులు పెట్టుకోవడం లేదు ఈ బ్యూటీ. అయితే తాజాగా శ్రియా దరించిన ఈ డ్రెస్‌పై దారుణమైన ట్రోల్స్ వస్తున్నాయి. ఆమె నడుస్తన్నప్పుడు ఆమె డ్రెస్‌ ఎక్కడ జారిపోతుందో అనేంతగా ఉంది.  ఆ సమయంలో డ్రెస్‌ను కవర్‌ చేసుకోలేక ఎంతో కష్టపడింది. ఇది చూసిన నెటిజన్లు ఆమెపై ట్రోల్స్ తో విరుచుకపడుతున్నారు.

(ఇదీ చదవండి: ఫిబ్రవరిలో హీరోయిన్ పెళ్లి.. ప్రెగ్నెన్సీ అంటోన్న నెటిజన్స్!)

కొందరు అంతగా ఇబ్బంది పడే డ్రెస్‌ ఎందుకు వేసుకోవడం అంటూ కామెంట్ చేస్తున్నారు. మరీ దారుణమైన కామెంట్‌ ఏమిటంటే.. సోషల్ మీడియాలో ఒక వర్గం వారు శ్రియాను  బాలీవుడ్‌ నటి ఉర్ఫీ జావేద్‌తో పోల్చుతున్నారు. ఇలాంటి చెత్త డ్రెస్‌లు ఆమెనే ఇచ్చిందా అంటూ.. ఉర్ఫీ జావేద్ 2.0 వెర్షన్ వచ్చిందని కామెంట్‌ చేస్తున్నారు. దీంతో శ్రీయా ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

2001లో టాలీవుడ్‌ నుంచి ఇష్టం సినిమాతో శ్రియా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆమె 2002లో వచ్చిన సంతోషం చిత్రంతో గుర్తింపు తెచ్చుకుంది. తరువాత, ఆమెకు టాలీవుడ్‌ టాప్‌ హీరోలతో నటించే అవకాశం దక్కింది. తాజాగా ఆమె సెకండ్‌ ఇన్నింగ్స్ లో కూడా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. హిందీలో ఆమె చేసిన 'దృశ్యం 2' సినిమా భారీ విజయం సాధించింది. అనంతరం తను మళ్లీ బిజీ యాక్టర్‌గా మారిపోయింది.



(ఇదీ చదవండి: అడివి శేష్‌కు ఛాలెంజ్‌ విసిరిన హైదరాబాద్‌ సీపీ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement