Varun-Lavanya Engagement: Upasana Kamineni Flaunts Baby Bump In A Silk Kaftan Worth Rs 19K - Sakshi
Sakshi News home page

వరుణ్‌ లావణ్య ఎంగేజ్‌మెంట్‌: బేబీ బంప్‌తో ఉపాసన, డ్రెస్‌ ఖరీదెంతో తెలుసా?

Published Sat, Jun 10 2023 3:12 PM | Last Updated on Sat, Jun 10 2023 5:11 PM

Varun Lavanya Engagement Upasana Kamineni Flaunts Baby Bump In A Silk Kaftan Worth Rs19K - Sakshi

లవ్‌బర్డ్స్‌ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్‌మెంట్‌ వేడుకలో టాలీవుడ్‌ ప్రముఖులు సందడి చేశారు. ముఖ్యంగా ఆస్కార్‌ హీరో రామ్‌చరణ్‌, ఉపాసన కామినేనితో కలిసి ఈ  నిశ్చితార్థ వేడుకకు హాజరయ్యారు. త్వరలోనే తల్లి దండ్రులు కాబోతున్న మెగా హీరో దంపతులు ఈవేడుకలో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచారు. 

త్వరలోనే తల్లి కాబోతున్న ఉపాసన ఆకుపచ్చ డ్రెస్‌లో బేబీ బంప్‌తో నిండుగర్భిణీగా చాలా అందంగా  కనిపించారు. బ్లాక్‌ అండ్‌ కాంబినేషన్‌ డ్రెస్‌లో రామ్‌చరణ్‌ భార్యను జాగ్రత్తగా చూసుకుంటూ, మరింత అందంగా కనిపించారు. బనారసీ ఎంబ్రాయిడరీ అంచుతో, సైడ్ స్లిట్‌లతో సిల్క్‌ మెటర్నటీ ఫ్యాషన్‌ కఫ్తాన్  డ్రెస్‌లో ఉపాసన డ్రెస్‌కు తగ్గినట్టుగా మాచింగ్‌ చోకర్, చెవి పోగులతో స్పెషల్‌ లుక్‌లో ఆకట్టుకున్నారు.  ప్రముఖ డిజైనర్, జయంతి రెడ్డి కలెక్షన్స్ కు చెందిన  ఈ డ్రెస్‌ ధర  రూ. 19,900 అట. (1200 లోన్‌తో మొదలై.. రూ 2.58 లక్షల కోట్లకు)

కాగా మెగా హీరో వరుణ్ తేజ్ కొణిదెల, లావణ్య త్రిపాఠి శుక్రవారం (జూన్9, 2023) ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకలో సిగ్గులమొగ్గయ్యి ఆకట్టుకున్న సొట్ట బుగ్గల సుందరి  లావణ్య కట్టుకున్న చీర ఎంత అనేది కూడా ఇంటర్నెట్‌లో చర్చకు తెరతీసింది.  డిజైనర్ అనితా డోంగ్రే  డిజైన్‌ చేసిన చీర  ధర రూ. 75వేలని తెలుస్తోంది. 

p>

నా ప్రియమైన తోడి కోడలా స్వాగతం
కొణిదెల కుటుంబంలోకి  ఆహ్వానం అంటూ ఉపాసన ట్వీట్‌ చేశారు. మై డియర్‌ లావణ్య తోడికోడలుగా మారే వేడుక కోసం ఎదురు చూస్తున్నాను. వరుణ్‌ చాలా  హ్యాపీగా ఉంది అంటూ  ఉపాసన తన సంతోషాన్ని ప్రకటించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement