ఢిల్లీ మ్యూజియంలో మంటలు | Delhi's Iconic National Museum of Natural History Destroyed In Fire | Sakshi
Sakshi News home page

ఢిల్లీ మ్యూజియంలో మంటలు

Published Tue, Apr 26 2016 3:57 PM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM

Delhi's Iconic National Museum of Natural History Destroyed In Fire

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ వరుస అగ్ని ప్రమాదాలతో హడలెత్తింది. ఆదివారం టీవీ టవర్ సమీపంలో అగ్ని ప్రమాదం, మంగళవారం తెల్లవారుజామున ఫిక్కీ ఆడిటోరియంలో భారీ అగ్నిప్రమాదం సంభవించి ఇంకా మంటలైనా ఆరకముందే ఢిల్లీలోని చారిత్రక సహజ జంతుజాలానికి సంబంధించిన జీవశాస్త్ర మ్యూజియంలో ఈరోజు తెల్లవారు జామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మ్యూజియంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఆరు అంతస్తుల వరకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో గాయపడిన ఏడుగురు సిబ్బందిని హూటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

35 అగ్ని నిరోధక వాహనాలు మంటలను ఆపేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాయి.  మ్యూజియంను సందర్శించిన కేంద్ర అడవులు, పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్ మ్యూజియం దేశపు ఆస్తి అని మంటలకు ఇంకా కారణాలు తెలియరాలేదని పేర్కొన్నారు. ప్రధాన మ్యూజియంలలో ఉన్న భద్రతాపరమైన చర్యలపై నివేదిక ఇవ్వవలసిందిగా ఆయన అధికారులను ఆదేశించారు. 1978లో స్థాపించిన ఈ మ్యూజియంను నిత్యం అనేక మంది విద్యార్థులు సందర్శిస్తుటారు. ప్రమాదం తెల్లవారు జామున సంభవించడంతో పెను ప్రమాదమే తప్పింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement