National Museum
-
చైనాలో 24 కోట్ల ఏళ్ల డ్రాగన్ శిలాజం
ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రదేశాల్లో శిలాజాలు బయటపడుతుంటాయి. వందల సంవత్సరాల క్రితం భూమిలో కూరుకుపోయిన జీవులు క్రమంగా శిలాజంగా మారుతుంటాయి. అయితే, చైనాలో 2003లో బయటపడిన భారీ డ్రాగన్ శిలాజం వయసు 24 కోట్ల సంవత్సరాలు ఉంటుందని సైంటిస్టులు తాజాగా నిర్ధారించారు. ఇంత వయసున్న డ్రాగన్ శిలాజం వెలుగుచూడడం ఇదే మొదటిసారి అని నేషనల్ మ్యూజియమ్స్ స్కాట్లాండ్ ఒక ప్రకటనలో వెల్లడించింది. చైనాలో ట్రియాసిక్ కాలానికి చెందిన ఈ శిలాజం భాగాలను తొలుత 2003లో దక్షిణ చైనాలోని గిజౌ ప్రావిన్స్‌లో గుర్తించారు. గత పదేళ్లలో తవ్వకాల్లో మరిన్ని భాగాలు బయటపడ్డాయి. వాటన్నింటినీ ఒకేచోట అమర్చగా అది ఐదు మీటర్ల డ్రాగన్‌గా తేలింది. 24 కోట్ల ఏళ్ల క్రితమే అది శిలాజంగా మారిపోయిందని పరిశోధకులు కనిపెట్టారు. దీనికి డైనోసెఫాలోసారస్ ఒరియంటలిస్ అని పేరుపెట్టారు. ముక్కు నుంచి తోక దాకా పూర్తి శిలాజాన్ని ఆవిష్కరించామని ఎన్ఎంఎస్ సైంటిస్టు డాక్టర్ నిక్ ఫ్రాసెర్ చెప్పారు. ఇది 8 అంకె ఆకారంలో ఉందని, చైనా డ్రాగన్లను గుర్తుకు తెస్తోందని వివరించారు. డ్రాగన్ కాల్పనిక జీవి కాదని, నిజంగానే ఉండేదని చెప్పడానికి ఈ శిలాజం ఒక ఆధారమని సైంటిస్టులు అంటున్నారు. రాక్షస బల్లుల తరహాలో వాతావరణ మార్పుల కారణంగా కోట్ల సంవత్సరాల క్రితం అవి అంతరించిపోయి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, చైనాలో బయటపడిన డ్రాగన్ శిలాజం మెడ చాలా పొడవుగా ఉండడం ఆసక్తి కలిగిస్తోంది. నదులు, చెరువుల్లో చేపలు పట్టుకోవడానికి వీలుగా దాని మెడ పొడవుగా సాగి ఉండొచ్చని భావిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బ్రెజిల్ నేషనల్ మ్యూజియంలో భారీ అగ్నిప్రమాదం
-
భారీ అగ్నిప్రమాదం : 200 ఏళ్ల క్రితం నాటి సంపదంతా...
బ్రెజిల్ నేషనల్ మ్యూజియంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో శతాబ్దాల కాలం నాటి పురాతన సంపదంతా కాలి బూడిదైపోయింది. రియో డి జానీరో ప్రాంతంలో ఈ మ్యూజియం ఉంది. 200 ఏళ్ల క్రితం నాటి ఈ మ్యూజియం సుమారు 20 మిలియన్ల కళాఖండాలకు పుట్టినిల్లు. జీవి, మానవశాస్త్ర, పురావస్తు శాస్త్ర, మానవజాతికి సంబంధించిన, భూగర్భ శాస్త్ర, జంతుజాలానికి సంబంధించిన అన్ని రకాల కళాఖండాలు దీనిలో ఉన్నాయి. కానీ ఒక్కసారిగా ఈ మ్యూజియం అగ్ని ప్రమాదానికి గురికావడంతో, ఈ సంపదంతా కాలి బూడిదైపోయింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించినప్పటికీ, అప్పటికే ఆ మ్యూజియమంతా మంటలు వ్యాపించేశాయని బ్రెజిల్ అధ్యక్షుడు మిచెల్ టెమర్ చెప్పారు. 200 ఏళ్ల నాటి వర్క్, రీసెర్చ్, నాలెడ్జ్ అంతా తాము కోల్పోయామని టెమర్ ఆవేదనతో ట్వీట్ చేశారు. ఇది బ్రెజిలియన్ల విషాదకరమైన రోజని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం రాత్రి ఏడున్నర గంటలకు ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకుందని రియో డి జానీరో ప్రకటన విడుదల చేసింది. అయితే ఈ ప్రమాదంలో ఎంత మంది ప్రాణాలు కోల్పోయారో వెల్లడించలేదు. ఈ అగ్నిప్రమాద వార్త వినగానే, తొమ్మిదేళ్లకు పైగా అక్కడే మ్యూజియాలజిస్ట్‌గా పనిచేస్తున్న మార్కో ఆరేలియో కాల్డాస్ అక్కడికి చేరుకున్నారు. ‘ఇది మా 200 ఏళ్ల నాటి సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్. లాటిన్ అమెరికాలో ఇది ఎంతో ప్రముఖమైనది. అంతా అయిపోయింది. మా వర్క్, మా జీవితం మొత్తం కోల్పోయాం’ అని కాల్డాస్ కన్నీరుమున్నీరయ్యారు. ఇతర మ్యూజియంలో పనిచేసే వారు, పరిశోధకులు, విద్యావేత్తలు, ఇంటర్నులు కూడా మ్యూజియం అగ్నిప్రమాదంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఎగిసిపడుతున్న మంటలను చూసి, కన్నీటిపర్యంతమయ్యారు. అమెరికన్ల చరిత్రకు సంబంధించిన అరుదైన కళాఖండాలకు పుట్టినిల్లు ఇది. అత్యంత ప్రసిద్ధ కళాఖండాలలో ఒకటైన"లుజియా" దీనిలోనే ఉంది. ఇది సుమారు 11,000 సంవత్సరాల క్రితం మరణించిన 25 ఏళ్ల మహిళ పుర్రె మరియు ఎముకలు. అతిపెద్ద ఉల్కను ఈ మ్యూజియంలో చూడొచ్చు. ఇది 5.36 టన్నులు బరువు ఉంటుంది. దీని 1784 సంవత్సరంలో కనుగొన్నారు. మమ్మీలు, శిల్పకళా విగ్రహాలు, రాతి శిల్పాలు వంటి పలు ఈజిప్ట్ కళాఖండాలు ఈ మ్యూజియంలో ఆకర్షణీయంగా ఉండేవి. కానీ ఇవన్నీ ఈ ప్రమాదంలో ఖాళీ బూడిదైపోయినట్టు తెలుస్తోంది. ఒకానొక సమయంలో ఇది పోర్చుగీస్ రాయల్ ఫ్యామిలీ. ఈ రాయల్ ప్యాలెస్ మ్యూజియంగా మార్చి, ప్రముఖ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్గా తీర్చిదిద్దారు. 1818లో దీన్ని ఏర్పాటు చేశారు. BREAKING: The National Museum of #Brazil in #Rio is completely consumed in fire. Founded in 1818, the museum is the holder of over 20 million items, including mummies, meteorites, insects, & fossils. So sad to see history in flames :( Video from @g1 live feed#museunacional pic.twitter.com/eCm8G6gKwA — Justin Fleenor 🔁 (@JustinFleenor) September 3, 2018 -
దొంగతనానికి పాల్పడ్డ మిలియనీర్
న్యూఢిల్లీ : ఢిల్లీ నేషనల్ మ్యూజియంలో అత్యంత విలువైన, పురాతన కాలానికి చెందిన ఓ రాతి గొడ్డలి జూన్ 24వ తేదీన చోరికి గురయింది. ఈ విషయం తెలిసిన మ్యూజియం అధికారులు దానిని ఎవరు తీశారో తెలుసుకోవడానికి తమవంతు ప్రయత్నాలు చేశారు. సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు. అందులో ఆ వస్తువును దొంగిలించిన వ్యక్తి కదలికలను గర్తించినప్పటికీ.. అతను ఎవరో తెలుసుకోలేకపోయారు. దీంతో మ్యూజియం అధికారులు శుక్రవారం పోలీసులను ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఆ వ్యక్తి గుర్గావ్కు చెందిన మిలియనీర్ ఉదయ్ రాత్రగా గుర్తించారు. శుక్రవారం రాత్రి ఉదయ్ ఇంటిపై దాడి చేసిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై ఐపీఎస్ అధికారి మధుర్ వర్మ ట్విటర్లో స్పందించారు. ఈ పురాతన చేతి గొడ్డలి లక్షల ఏళ్ల కిందట మానవులు తమ రక్షణకు ఉపయోగించిందన్నారు. ఉదయ్‌కు గతంలో కూడా నేర చరిత్ర ఉందని పేర్కొన్నారు. 20 ఏళ్లు యూకేలో ఉన్న ఉదయ్‌ను అక్కడి అధికారులు 2006లో ఇండియాకు పంపిచేశారని తెలిపారు. 2016లో యూఎస్ విదేశాంగ సెక్రటరీ జాన్ కెర్రీ ఓ హోటల్లో బస చేసిన సమయంలో అక్కడ భయానక వాతావరణం సృష్టించడంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని వెల్లడించారు. తాజా ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను కూడా విడుదల చేశారు. -
ఢిల్లీ మ్యూజియంలో మంటలు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ వరుస అగ్ని ప్రమాదాలతో హడలెత్తింది. ఆదివారం టీవీ టవర్ సమీపంలో అగ్ని ప్రమాదం, మంగళవారం తెల్లవారుజామున ఫిక్కీ ఆడిటోరియంలో భారీ అగ్నిప్రమాదం సంభవించి ఇంకా మంటలైనా ఆరకముందే ఢిల్లీలోని చారిత్రక సహజ జంతుజాలానికి సంబంధించిన జీవశాస్త్ర మ్యూజియంలో ఈరోజు తెల్లవారు జామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మ్యూజియంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఆరు అంతస్తుల వరకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో గాయపడిన ఏడుగురు సిబ్బందిని హూటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 35 అగ్ని నిరోధక వాహనాలు మంటలను ఆపేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. మ్యూజియంను సందర్శించిన కేంద్ర అడవులు, పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్ మ్యూజియం దేశపు ఆస్తి అని మంటలకు ఇంకా కారణాలు తెలియరాలేదని పేర్కొన్నారు. ప్రధాన మ్యూజియంలలో ఉన్న భద్రతాపరమైన చర్యలపై నివేదిక ఇవ్వవలసిందిగా ఆయన అధికారులను ఆదేశించారు. 1978లో స్థాపించిన ఈ మ్యూజియంను నిత్యం అనేక మంది విద్యార్థులు సందర్శిస్తుటారు. ప్రమాదం తెల్లవారు జామున సంభవించడంతో పెను ప్రమాదమే తప్పింది. -
లెబనాన్
ప్రపంచ వీక్షణం రాజధాని: బీరూట్ జనాభా: 48,31,233 (తాజా అంచనాల ప్రకారం) అధికారిక భాష: అరబ్బీ, ఫ్రెంచ్ విస్తీర్ణం: 10,452 చ.కి.మీ ద్రవ్యం: లెబనీస్ పౌండ్ ప్రభుత్వం: గణతంత్ర పార్లమెంట్ తరహా ప్రభుత్వం బాంబుల దేశం - లెబనాన్: నిత్యం బాంబు పేలుళ్లతో దద్దరిల్లే లెబనాన్, నిజానికి ఎంతో అందమైన ప్రకృతి సౌందర్యం కలిగిన దేశం. క్రీస్తు పూర్వం 12వ శతాబ్దం నుండి చరిత్రలో ఉనికిని కలిగి వున్న దేశం లెబనాన్. దేశంలో సగభాగం పర్వత సానువులతో నిండి ఉంటుంది. ఏడాదిలో ఎక్కువ కాలం మంచుతో కప్పబడి ఉంటుంది. ప్రకృతి సోయగాలతో పర్యాటకులకు ఆహ్లాదం కలిగిస్తూ ఉంటుంది. ఒకప్పుడు బాబిలోనియా, ఈజిప్టు, పర్షియా, గ్రీక్, రోమ్... దేశస్థులతో నిండి ఉండేది. ప్రస్తుతం లెబనాన్‌లో ఆర్మేనియన్లు, అస్సీరియన్లు, కుర్దులు, గ్రీకులు, యూదులు కలిపి దాదాపు 30 లక్షల జనాభా ఉన్నారు. 1941లో లెబ నాన్కు, ఫ్రాన్స్ స్వాతంత్య్రం ప్రకటించింది. 1943లో ఏర్పరచుకున్న ఒప్పందం ప్రకారం లెబనాన్‌లో రాష్ట్రపతిగా మెరోనైట్ జాతివాడు, ప్రధానిగా సున్నీ మతస్థుడు, స్పీకర్‌గా షియా మతస్థుడు ఉండాలి. కానీ తర్వాతి కాలంలో ఈ ఒప్పందాన్ని కాలగర్భంలో కలిపేశారు. 1960 తర్వాత ముస్లిం మతస్థులు దేశంలో అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. పర్యాటకుల పాలిట స్వర్గం - బీరూట్ నగరం: ప్రతిరోజూ దేశంలో ఎక్కడో ఒకచోట బాంబులు పేలుతున్నా పర్యాటకులు మాత్రం లెబనాన్ దేశాన్ని ఎంతో ఇష్టంగా చూడడానికి వస్తుంటారు. ముఖ్యంగా బీరూట్ నగరం పర్యాటకులకు స్వర్గం లాంటిదే. ఇజ్రాయెల్, సిరియా దేశాల దాడులతో బీరూట్ నగరం సగానికి పైగా నాశనమైపోయింది. హోటళ్ళు, విమానాశ్రయం తరచుగా మూతపడుతుంటాయి.ఈ దేశ ప్రజలు అక్కడకు వచ్చే పర్యాటకులను ఎంతో గౌరవంగా చూసుకోవడం ఇక్కడి ప్రత్యేకత. ఎవరింటికైనా వెళితే, ముందుగా టీ లేదా కాఫీ ఇవ్వడం వీరి సంప్రదాయం. ఐతే పర్యాటకులు ఇంటిలో ఉండే పెద్దలకు, తర్వాత చిన్నవారికి అభివాదం చేయాలి. ముఖ్యమైన పండుగలు: క్రైస్తవులు క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకుంటా రు. అయితే క్యాథలిక్కులు, ప్రొటెస్టంట్లు, మెన్కైట్ క్రిస్టియన్స్... క్రిస్మస్ను డిసెంబర్ 25న జరుపుకొంటే, ఆర్మేనియన్ క్రిస్టియన్లు మాత్రం క్రిస్మస్ పండుగను జనవరి 6వ తేదీన జరుపుకుంటారు. ముస్లిమ్‌లు రంజాన్, బక్రీద్ పండుగలు జరుపుకొంటారు. జీవనాధారం - వ్యవసాయం జనాభాలో అత్యధికులు వ్యవసాయం చేస్తారు. పళ్ళు, కూరగాయలు ముఖ్యంగా ఆలివ్, ద్రాక్ష, ఆప్రికాట్, ఆపిల్, ఉల్లి, బంగాళదుంపలను ఎక్కువగా పండిస్తారు. వీటితో పాటు పత్తి, పొగాకు, చెరకులను అధికంగా పండిస్తారు. ఇప్పుడిప్పుడే సిమెంటు, చక్కెర పరిశ్రమలు వృద్ధి చెందుతున్నాయి. టైరె నగరం: టైరె నగరాన్ని 1984లో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించారు. ప్రకృతిని చూడాలంటే లెబనాన్‌లో మధ్య తూర్పు ప్రాంతానికి వెళ్ళాల్సిందే. అక్కడ కొండలు, పర్వతాలు, అబ్రహం నది ఎంతో సుందరంగా దర్శనమిస్తాయి. లెబనాన్‌లో ఎక్కడ, ఎప్పుడు శత్రువులు విరుచుకుపడతారో, ఎక్కడ బాంబుల వర్షం కురుస్తుందో చెప్పడం కష్టం. అయినా ప్రతి సంవత్సరం లెబనాన్ దేశాన్ని 20 లక్షల మందికి పైగా యాత్రికులు దర్శిస్తుంటారు. ప్రైవేటు ఆర్మీ: అరబ్ - ఇజ్రాయెల్ దేశాల మధ్య తరచూ యుద్ధాలు జరుగుతుండడంతో అందరూ ప్రైవేటు ఆర్మీలను ఏర్పరచుకున్నారు. 1948 మొదలు ఇప్పటివరకూ ఈ ప్రైవేటు ఆర్మీలను ముందుంచుకొని తమ తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి ఆయా నాయకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీనికి తోడు ఇజ్రాయెల్ దేశస్థులు ఈ దేశంలోకి విపరీతంగా వలస రావడం, లెబనాన్ మీద ఇజ్రాయెల్ దాడిచేసి కొంత భూభాగాన్ని ఆక్రమించడంతో లెబనాన్ రావణకాష్ఠంగా మారిపోయింది. ప్రత్యేక ఆహార పదార్థం కిబ్బె: లెబనాన్ల ఆహారం ప్రత్యేకంగా ఉంటుంది. వీరు తీసుకునే ముఖ్యమైన ఆహారం - కిబ్బె. ఇది... గొర్రె మాంసం, గోధుమ నూక కలిపి ఉడికించిన పదార్థం. దీనికి తోడు టొమాటో రసం ఉంటుంది. ఇక వీరిలో చాలామంది ఆహారంతో పాటు అరక్ అనే బీరు లాంటి పానీయాన్ని తీసుకుంటారు. ఇది ద్రాక్షరసంతో తయారవుతుంది.ఇక హోటళ్ళలో ‘మెజ్జె’ అనే ఆహారపదార్థం లభిస్తుంది. దీనిని చేపలు, గొర్రె మాంసంతో కలిపి తయారుచేస్తారు. దీనితోపాటు పళ్ళ రసాలు, కాఫీ, పళ్ళు కూడా లభిస్తాయి. అప్పుడప్పుడు అన్నం, ఉల్లిపాయ కూర కూడా దొరుకుతాయి. ఇక ఆర్థికంగా బీదరికంలో ఉన్నవాళ్ళు మాత్రం రోజూ బ్రెడ్ తింటారు. దీనికి తోడు హమ్మస్, ఫూల్ అనే మాంసం, బీన్స్ ముక్కలను తింటారు. సీ క్యాజిల్ కట్టడం ఇన్ సిడాన్ నగరంలో సముద్రంలో నిర్మించిన సీ క్యాజిల్ కట్టడం చూపరులను ఎంతగానో ఆకర్షిస్తుంది. దీనిని 13వ శతాబ్దంలో నిర్మించారు. బిబ్లోస్ నగరంలో ఉన్న బిబ్లోస్ కోటను 12వ శతాబ్దంలో నిర్మించారు. ఇక, ట్రిపోరీ ఓడరేవు నగరం. ఇది అత్యంత పురాతన నగరం. బాట్రౌన్ నగరం లెబనాన్ దేశంలో మరొక పురాతన నగరం. సముద్రపు ఒడ్డున ఉన్న ఈ నగరంలో ప్రకృతి రమణీయంగా ఉంటుంది. ఈ నగరానికి ఒక వైపు సముద్రమే రక్షణగా ఉందా అనిపిస్తుంది. తూర్పు లెబనాన్ ప్రాంతంలో ఉన్న జెష్లే నగరం తూర్పు లెబనాన్‌కు రాజధాని నగరంగా పరిగణన పొందుతోంది. మెసీల్లా కోట మెసీల్లా కోట బాట్రౌన్ నగరంలో ఉంది. ఇది అతి పురాతనమైన కోట. మధ్య యుగ కాలానికి చెందిన ఈ కోట ఉత్తర బాట్రౌన్ నగరంలో ఉంది. ఈ కోటను అమీర్ ఫక్రుద్దీన్ అనే రాజు సన్నని పొడవైన సున్నపురాతితో 17వ శతాబ్దంలో నిర్మించాడు. ఇది సహారా ఎన్జాజ్ నది ఒడ్డున ఉంది. నేషనల్ మ్యూజియం ఇక బీరూట్ నగరంలోని నేషనల్ మ్యూజియం తప్పక చూడాల్సిందే. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత వస్తు సేకరణ మొదలై, అధికారికంగా 1942లో ఇది ప్రారంభమైంది. పురాతన శాఖ డెరైక్టరేట్ జనరల్ చేపట్టిన తవ్వకాల నుండి లభించిన మధ్యయుగానికి చెందిన వస్తువులు, మధ్యయుగం లో ఆవిష్కరించిన వస్తువులు దాదాపు లక్షకు పైగా ఉన్నాయి. చరిత్ర పూర్వకాలంలో నుండి మధ్య యుగ మామ్లుక్ కాలానికి చెందిన 1300 పైగా కళాఖండాలు ప్రదర్శించబడుతున్నాయి. అంజార్ నగరంలో ఉన్న టెట్రాపైలాన్ను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించారు. దీనిని 1300 సంవత్సరాల క్రితం నిర్మించారు.