ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్‌ | Kharge Demanded EC Action Against Prime Minister Modi For Bulldozer On Ram Temple Remark | Sakshi

ప్రధాని రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారు: ఖర్గే

May 18 2024 3:55 PM | Updated on May 18 2024 6:06 PM

Kharge Demanded Action On Prime Minister Modi

ముంబై: రామమందిరంపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న ప్రధాని మోదీపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌(ఈసీ)ని కాంగ్రెస్‌ నేషనల్‌ చీఫ్‌ మల్లిఖార్జున ఖర్గే డిమాండ్‌ చేశారు. ముంబైలో శనివారం(మే 18) ఖర్గే  మీడియాతో మాట్లాడారు.

‘ప్రధాని మోదీ రామమందిరంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఓటర్లను రెచ్చగొడుతున్నారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రామమందిరంపై బుల్డోజర్‌లు ఎక్కిస్తారని బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటివరకు మేం బుల్డోజర్ పదాన్ని ఎక్కడా వాడలేదు. 

ఇలాంటి రెచ్చగొట్టే ప్రసంగాలు చేసేవారిపై ఎన్నికల కమిషన్‌(ఈసీ) చర్యలు తీసుకోవాలి. ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగం ప్రకారం అన్నింటిని కాపాడతాం. మేం రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటాం’ అని ఖర్గే తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement