PM seat
-
విజయపతాక ఎగరేయాలి
బెంగళూరు: వచ్చే ఐదేళ్ల భారతావని దశ, దిశను నిర్ధేశించే ఎన్నికల రణరంగంలో విజయబావుటాను ఎగరేశాకే ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్థి ఎవరనేది వెల్లడిస్తామని కాంగ్రెస్ సారథి మల్లికార్జున ఖర్గే స్పష్టంచేశారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా మంగళవారం పీటీఐతో ఆయన ముఖాముఖి మాట్లాడుతూ పలు అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ‘‘ గెలిచాక వచ్చే ఐదేళ్లలో చేపట్టాల్సిన పథకాలు, పనుల పట్టికలను ముందుగానే సిద్ధంచేసుకుంటున్నట్లు ప్రధాని మోదీ చెబుతున్నారు. అన్ని మంత్రిత్వ శాఖల కార్యదర్శులను పిలిపించి పనులు పురమాయిస్తున్నారు. గెలవకముందే ఆయన చేస్తున్న హడావిడి అంతాఇంతా కాదు. ఈయన అత్యుత్సాహం, అతి ఆత్మవిశ్వాసం భారత్‌లాంటి ప్రజాస్వామ్యదేశానికి ఏమాత్రం మంచిదికాదు’’ అని వ్యాఖ్యానించారు. ‘‘ కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన ఘన విజయాలు లోక్‌సభ ఎన్నికల్లో సానుకూల పవనాలు వీచేలా చేస్తున్నాయి. ఇది నిజంగా శుభపరిణామం. కాంగ్రెస్‌పాలిత రాష్ట్రాల్లో ధరవరలను కిందకు దించేలా మేం తెచ్చిన పలు పథకాలు, చేపట్టిన కార్యక్రమాలను జనం మెచ్చారు. మా గ్యారెంటీ స్కీమ్‌లు ఇదే విషయాన్ని నిరూపించాయి కూడా. అందుకే మా గ్యారెంటీ పథకాలపై ఓటర్లు దృష్టిపెట్టారు’’ అని అన్నారు. ఈసారి ఎన్ డీఏ కూటమి 400 చోట్ల విజయం సాధిస్తుందని మోదీ ముందే ప్రకటించిన విషయాన్ని ఖర్గే వద్ద ప్రస్తావించగా.. ‘‘ ఇంకా నయం. ఆయన ఈసారి 600 సీట్లు మావే అనలేదు. ఇంతటి అతి అత్యాశతో చేసే వ్యాఖ్యానాలు వింటుంటే దేశంలో విపక్షమే లేదు.. అంతా నేనే అన్నట్లుగా ఉంది మోదీ వైఖరి’’ అని ఖర్గే అసహనం వ్యక్తంచేశారు. ఆనాడూ వెలిగిపోతుందన్నారు ‘‘ 2004లోనూ ఇదే సీన్ కనిపించింది. భారత్ వెలిగిపోతోంది(ఇండియా ఈజ్ షైనింగ్) అంటూ దేశవ్యాప్తంగా భారీ ప్రకటనలు, నినాదాలతో నాటి బీజేపీ సర్కార్ మోతెక్కించింది. వాజ్‌పేయీ మాత్రమే ప్రధాని పదవికి అర్హుడు అన్నట్లు ప్రచారం చేశారు. చివరకు ఏమైంది?. మన్మోహన్ సింగ్ సారథ్యంలో కాంగ్రెస్ నేతృత్వంలో మేం ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాం. మన్మోహన్ మెరుగైన ప్రధానిగా నిరూపించుకున్నారు’’ అని చెప్పారు. అమేథీ, రాయ్‌బరేలీకి టైం ఉంది ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ, రాయ్‌బరేలీ నియోజకవర్గాల నుంచి ఈసారి ఎవరు పోటీచేస్తారన్న ప్రశ్నకు సమాధానంగా.. ‘ ఆ స్థానాల్లో పోలింగ్ తర్వాతి ఫేజ్‌లలో ఉందిగా. ఇంకా సమయం ఉంది. ఇప్పుడే చెప్పేస్తే రాజకీయ సర్ప్రైజ్ ఏముంటుంది?. ఫీడ్‌బ్యాక్ తీసుకుని అక్కడ అభ్యర్థులు ఎవరు అనేది తర్వాత వెల్లడిస్తాం. అందరి సమ్మతితోనే కాంగ్రెస్‌లో నిర్ణయాలు ఉంటాయి. మోదీలాగా అందరి తరఫున ఇక్కడ ఒక్కరే నిర్ణయాలు తీసుకోరు’’ అని అన్నారు. ‘‘ ఎలక్టోరల్ బాండ్ల పథకంలో పారదర్శకత లోపించింది. ఒక్క బీజేపీనే భారీగా లాభపడింది. పారిశ్రామికవేత్తలు, సంస్థలను లొంగదీసుకునేందుకు దర్యాప్తు సంస్థలను రంగంలోకి దింపారు. ‘ చందా ఇచ్చుకో. దందా పుచ్చుకో’ అన్న సూత్రం పాటించారు. చేతులు వెనక్కి మెలిపెట్టి మరీ డబ్బులు తీసుకుని ఇప్పుడు పారదర్శకత ఉంది అంటే ఎలా?’’ అని ప్రశ్నించారు. తుక్డే తుక్డే గ్యాంగ్‌కు సుల్తాన్ మోదీనే ‘‘కుల, మత, ప్రాంత, వర్ణ ప్రాతిపదికన దేశ ప్రజలను మోదీ విభజిస్తున్నారు. నిజానికి తుక్డే తుక్డే గ్యాంగ్‌కు సుల్తాన్ మోదీనే. దేశ స్వాతంత్య్రం కోసం త్యాగాలు చేసిన ఒక్క బీజేపీ నేతనైనా చూపించండి. ఆర్ఎస్ఎస్, బీజేపీలో ఒక్కరైనా దేశం కోసం పోరాడారా?’ అని ఖర్గే ఎద్దేవాచేశారు. సమాలోచనలతోనే సారథి ఎంపిక ‘‘ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ వచ్చాక విపక్షాల ‘ఇండియా’ కూటమిలో చర్చలు జరిపి ఏకాభిప్రాయంతో ప్రధాని అభ్యర్థి ఎవరనేది ప్రకటిస్తాం. ఈసారి నేను పోటీ చేయట్లేదు. గుల్బర్గా(కలబురిగి) సీటు వేరే వాళ్లకు ఇచ్చేశారు’ అని తాను ప్రధాని రేసులో లేనని పరోక్షంగా చెప్పారు. గుల్బర్గా(కలబురిగి) నుంచి ఈసారి ఖర్గే అల్లుడు రాధాకృష్ణ దొడ్డమణి పోటీచేస్తున్నారు. 2009 నుంచి 2014 వరకు ఖర్గే ఇక్కడి నుంచే ఎంపీగా గెలిచారు. -
ప్రధానిగా ఖర్గే పేరు.... ఇండియా కూటమిలో చీలిక?
ఢిల్లీ: ఇండియా కూటమి తరుపున పీఎం అభ్యర్థిపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. 1977 నాటి లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థి పేరును ఖరారు చేయకుండానే ఎన్నికలు జరిగాయని గుర్తు చేశారు. 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ఇండియా కూటమి తరుపున ప్రధాని అభ్యర్థి ఎవరనే అంశంపై శరద్ పవార్ స్పందించారు. '1977 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత మొరార్జీ దేశాయ్ ప్రధానిగా అయ్యారు. ప్రధాని అభ్యర్థి పేరును ముందే ప్రకటించకున్నా ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ప్రజలు మార్పును కోరుకున్నారు. కొత్త వ్యక్తులు ప్రధానిగా అయ్యారు.' అని పవార్ అన్నారు. అయితే.. ఇండియా కూటమి తరుపున ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే పేరును పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సహా కొన్ని పార్టీలు ఇప్పటికే సూచించాయి. శరద్ పవార్ వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి షెహబాద్ పూనావాలా స్పందించారు. దీదీ పేర్కొన్న ప్రధాని అభ్యర్థిపై కాంగ్రెస్ కూడా సంతోషంగా లేదని అన్నారు. ఇండియా కూటమిలో చీలిక స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. ఇదీ చదవండి: హిందూయిజంపై ఎస్పీ నాయకుడు వివాదాస్పద వ్యాఖ్యలు -
ప్రధానిగా 16 ఏళ్ల అమ్మాయి
టేకోవర్ అనే మాటలోనే ఏదో పవర్ ఉన్నట్లుంది. పగ్గాలు చేతుల్లోకి తీసుకోవడం, దిగ్గజాలను కలిపేసుకోవడం, చేజిక్కించుకోవడం, స్వాధీనం, హస్తగతం.. ఇలాంటివన్నీ గన్ చేతుల్లోకి వచ్చినట్లుండే టేకోవర్స్. ఎట్లా ఉంటుంది గన్ చేతుల్లోకి వస్తే! చేతి నిండా పట్టుకోవాలనిపిస్తోంది. కళ్ల నిండుగా చూసుకోవాలనిపిస్తుంది. గాల్లోకి ఒక రౌండ్ కాల్చాలనిపిస్తుంది. కాల్చాక గన్ని ప్యాంట్ వెనుక షర్ట్ కింద దోపుకోవాలనిపిస్తుంది. సినిమాల్లో మహేష్ బాబును చూడట్లేదేంటి! అమ్మాయిలైనా అంతే. గన్ చేతికి వస్తే.. ‘ఈ తొక్కలో లవ్వేంట్రా!’ అని ధన్ ధన్ మని కనీసం ఇద్దరు ముగ్గురిని లేపేస్తారు. ఎక్కువ టైమ్ తీసుకోనివ్వదు గన్ అయినా, టేకోవర్ అయినా. మీడియాతో మాట్లాడుతున్న ఆవాముర్తో గర్ల్స్ ఈ లోకాన్ని టేకోవర్ చేయడాన్ని కాసేపు ఊహించండి. పవర్ ఆడవాళ్ల చేతుల్లోకి వచ్చినట్లు. జిల్లా ఎస్పీతో మొదలవుతుంది సెల్యూట్ కొట్టడం. డీజీపీ కొడతాడు. డిఫెన్స్ మినిస్టర్ కొడతాడు. త్రివిధ దళాలు లైన్‌గా తల ఓ పక్కకి తిప్పి నడుస్తాయి. ఒకేసారి అనేకచోట్ల ఐటీ దాడులు జరిగినట్లు దేశమంతటా ఏరివేతలు మొదలవుతాయి. గూండాలు సరెండర్ అవుతుంటారు. మాఫియా గ్యాంగులు అజ్ఞాతంలోకి వెళ్లిపోతాయి. ఆడవాళ్లను వేధించేవాళ్లు ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకుని రోడ్లపై పరుగులు తీస్తుంటారు. భలే ఉంటుంది సీన్. పసిపాప పకపకమని నవ్వుతున్నట్లు. ఓ పదహారేళ్ల అమ్మాయి ప్రైమ్ మినిస్టర్ సీట్లో కూర్చున్నట్లు కూడా ఊహించండి. ఆవా ముర్తో కి 16 ఏళ్లే. ఫిన్లాండ్ ప్రధానిగా ఒకరోజు దేశాన్ని చేతుల్లోకి తీసుకునే ఛాన్స్ వచ్చింది ఆ అమ్మాయికి. ఆ ఛాన్స్ ఇచ్చింది ఎవరంటే సనా మారిన్ అనే 35 ఏళ్ల అమ్మాయి. ఫిన్లాండ్ చరిత్రలోనే ఎంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్. ‘గర్ల్స్ టేకోవర్’ అని ఇప్పుడో గ్లోబల్ క్యాంపెయిన్ నడుస్తోంది. బాలికల హక్కుల్ని ప్రమోట్ చెయ్యడానికి. ఆవాను అందుకే తన సీట్లో కూర్చోబెట్టుకున్నారు సనా. పీఎం సీట్లో కూర్చోగానే ఆవా చెప్పిన మొదటి మాట.. అబ్బాయిలెంత ముఖ్యమో దేశానికి అమ్మాయిలూ అంతే ముఖ్యం. దేశాన్ని నడిపించేవారు ఈ సంగతి గ్రహించాలి.. అని! -
అధికారాంతమునందు చూడవలె...
అక్షర తూణీరం: అసలా పార్టీ పుట్టడమే కాడి, జోడెద్దులలో పుట్టింది. కాడిని ఏనాడో తీసి ప్రజల మెడ మీద వేశారు. ప్రధాని కుర్చీనీ, పార్టీ ప్రధాన కుర్చీనీ కలిపి కుట్టేసి భిన్నత్వంలో ఏకత్వం అన్నారు. జోడెద్దులు ఒంటెద్దు అయింది. ‘అధికారాంతమునందు చూడ వలె ఆ అయ్య సౌభాగ్యముల్...’ ఇదొక నీతిపద్యం నాలుగోపాదం. మొన్నామధ్య కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గాంధీబొమ్మ నీడలో కూర్చుని అంతర్మథనానికి పూనుకున్నారు. నాకు ముచ్చటేసింది. వరసగా పదేళ్లు అధికార పార్టీలో ఉన్న మనం విపక్షంగా విఫలమవుతున్నామా? ప్రతిపక్ష పాత్రని సమర్థ వంతంగా పోషించే విద్వత్తు కొరవడిందా? అల వాటుగా ఎర్రదీపం కారువైపు కాళ్లు లాగుతున్నాయా? మనం పవర్లో లేమన్న నిజం మరచి తాజా అవినీతి ఆరోపణలకు సంజాయిషీలివ్వడానికి సిద్ధపడుతున్నా మా? ఔననే జవాబువస్తోంది. ఇది సహజమే. పదేళ్ల అలవాట్లని పదినెలలైనా అవకుండా మార్చుకోవడం అంత తేలికకాదు. దీనికి ఆధారాలున్నాయి. రఘువంశ పూర్వీకుడు హరిశ్చంద్రుడు నానా అగ చాట్లుపడి సత్యహరిశ్చంద్రుడై సకుటుంబంగా తిరిగి రాజ్యానికి వచ్చాడు. చంద్రమతి అలవాటుగా రాజప్రాసా దంలో కసువూడ్చడం, అంట్లు తోమడం మొదలుపెట్టి, ఆనక నాలిక్కరుచుకునేది. లోహితాశ్యుడు వంటశాల వెను క గుమ్మంలో నిలబడి, ‘మాతా, చంద్రమతీ! ఆకలిగొన్న ఈ పుత్రునకు శేష భోజనము దయసేతువా?’ అని దీనం గా అర్థించువాడట. తల్లి మిక్కిలిగా విలపించి, ‘నాయనా! అఖండ భూమండ లాధీశు కుమారునకెట్టి దుర్గతి పట్టి నది? నీ తండ్రి దమ్మిడీకి కొరగాని కీర్తి కొరకు నిన్ను నన్ను బలి చేసినాడు’ అని ఇంకను పరిపరి విధముల వాపోయె డిదట. రాముడు అరణ్యవాసం, యుద్ధకాండ ముగించు కుని అయోధ్యకి వచ్చాడు. లక్ష్మణుడు వేకువజామునే అంతఃపురం దగ్గర ఉన్న వేపచెట్టెక్కి మొహం పుల్లలు విరిచి, తానొకటి నోట కరుచుకుని రెండింటిని రొంటిని దోపుకుని దిగాడు. సాక్షాత్తు రాజు చెట్టెక్కగా చూసిన రాచ నెమళ్లు తత్తరపడి పింఛములు ముడిచి చెట్టు దిగినవి. కోకిలలు పాట మరచినవి. చిలకలు తొర్రలో ఒదిగిపోయి నవి. దాసదాసీజనం నివ్వెరపాటుకి గురైనారు. విషయం గ్రహించి, నోట పుల్ల తీసి లక్ష్మణస్వామి నవ్వుకున్నాడు. రక్షయన్నట్టు రాముడు నవ్వినాడు. ఘటనకు సీత నవ్వి నది. ఇన్నేళ్లకు మనసారా తల్లులు నవ్విరి. పద్నాలుగేళ్ల నిద్రని పూర్తిగా వదుల్చుకుని ఊర్మిళ మగతగా నవ్వినది. రాజగురువు వశిష్టుల వారు నదీస్నానం చేసి ఆశ్రమానికి వెళుతూ నవ్వులను ఆలకించి, చిరునవ్వారు. ఏమా నవ్వు లని మూల పురుషుడు సూర్యదేవుడు తూరుపుకొండపై నుంచి తొంగిచూచాడు. అయోధ్యలో భళ్లున తెల్లవా రింది! ఇంతకు ఇది అలవాటులో పొరబాటు. ఆ మథనంలో కాంగ్రెస్ వాళ్లు ఒంటెద్దు పోకడలు మానుకోవాలని కూడా అనుకున్నారు. కాని సాధ్యమే! అసలా పార్టీ పుట్టడమే కాడి, జోడెద్దులలో పుట్టింది. కాడిని ఏనాడో తీసి ప్రజల మెడ మీద వేశారు. ప్రధాని కుర్చీనీ, పార్టీ ప్రధాన కుర్చీనీ కలిపి కుట్టేసి భిన్నత్వంలో ఏకత్వం అన్నారు. జోడెద్దులు ఒంటెద్దు అయింది. మళ్లీ ఒంటెద్దును జోడెద్దులు చేయడం అసాధ్యం. అలవాట్లు ఒకందాన పోవు. అరణ్య, అజ్ఞాతవాసాల తర్వాత పాండవుల బతుకు ఇలాగే అయింది. ధర్మరాజు పొడుగాటి సిల్కు లాల్చీతో వీధుల వెంట తిరిగేవాడు. భీముడు వంటశాలకి అంకి తం. అర్జునుడు రకరకాల నాట్యముద్రలు పడుతూ విలు విద్యపై గురితగ్గించాడు. నకుల, సహదేవులకు గుగ్గిళ్ల మీద ధ్యాసపోలేదు. ద్రౌపది జుట్టు విరబోసుకుని మూర లు మూరలు పూలు కడుతోంది. ఎక్కడో ఉన్న కృష్ణుడు ఈ పరిణామానికి బాగా వర్రీ అయ్యాడు. రానున్న మహా సంగ్రామానికి వీరిని సమాయత్తం చేయడం ఎలా? అనే పాయింట్ మీద వర్కవుట్ చేసుకుంటూ వచ్చాడు. చివర కు యుద్ధంలో విజయం సాధించి పెట్టాడు. అదొక చరిత్ర. ‘కాని పలు నీతులు, ధర్మాలు భారతం నిండా చెబు తూ వచ్చిన విదురుడు లాంటి వారు నూతన సామ్రాజ్యా నంతరం ఏమయ్యారు?’- ధర్మసందేహం గురువుగారిని అడిగాను. ‘ఆ, ఏముంది? ఎప్పటి వలెనే ధర్మసూక్ష్మాలు అవ శేష ప్రజకు బోధిస్తూ...’ ‘ఇంకా ఎందుకండీ ధర్మసూక్ష్మం? ధర్మ సంస్థాపన జరిగిపోయింది కదా!’ అన్నాను. ‘జరిగినా అవసరమే! మనకిక్కడ ఆచార్య కోదండ రాం లాగా!’ అన్నారు గురువుగారు. ఆచార్యునకు కడకు పూర్వానుసారము! - శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథా రచయిత)