ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ పదవి నుంచి శరద్ పవార్ తప్పుకోవడంపై ఆ పార్టీ నేత అజిత్ పవార్ స్పందించారు. పవార్ నిర్ణయాన్ని సమర్థిస్తూ.. కొత్తగా ఎన్నికయ్యే తదుపరి పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ ఆధ్వర్యంలోనే పనిచేస్తారని తెలిపారు. శరద్ పవార్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని నిరసన వ్యక్తం చేస్తున్న ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలతో అజిత్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఎన్సీపీ కుటుంబానికి పవార్ సాహెబ్(శరద్ పవర్) ఎప్పుడూ అధిపతిగా ఉంటారని, ఆయన మార్గదర్శకత్వంలోనే కొత్త అధ్యక్షులు పనిచేస్తారని అజిత్ పవార్ తెలిపారు. శరద్ నిర్ణయంపై ఎమోషనల్ అవ్వద్దంటూ పార్టీ కార్యకర్తలకు, నేతలకు సూచించారు. ఎన్సీపీ నాయకత్వంలో మార్పు ఆవశ్యకత గురించి కొన్ని రోజుల క్రితమే పవార్ స్వయంగా చెప్పారని పేర్కొన్నారు. ఆయన వయస్సు, ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని తన నిర్ణయాన్ని గౌరవించాలన్నారు.
చదవండి: గుజరాత్ హైకోర్టులో రాహుల్‌గాంధీకి ఎదురుదెబ్బ
అయితే పార్టీ అధ్యక్ష పదవి నుంచి వైదొలగడంపై తన దిగ్భ్రాంతికరమైన నిర్ణయాన్ని పునరాలోచించుకోవడానికి శరద్ పవార్ అంగీకరించారని, ఇందుకు రెండు మూడు రోజులు సమయం కావాలని అడిగినట్లు అజిత్ పవార్ తెలిపారు. ఈ మేరకు అజిత్ పవార్.. సుప్రియా సూలే ఇతర పార్టీ నాయకులతో కలిసి మంగళవారం సాయంత్రం శరద్‌పవార్‌ను కలిశారు. ఒకవేళ తదుపరి పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి వస్తే శరద్ పవార్ సూచించిన కమిటీలోని సభ్యులు ఎన్సీపీ కుటుంబంలోనే ఉన్నారని, బయట నుంచి కాదని స్పష్టం చేశారు.
కాగా ఎన్సీపీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆ పార్టీ వ్యవస్థాపకులు సీనియర్ రాజకీయ నేత శరద్ పవార్ మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ముంబయిలో జరిగిన తన ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో 82 ఏళ్ల పవార్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పవార్ నిర్ణయంతో ఆయన అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొంతమంది కార్యకర్తలయితే కన్నీటిపర్యంతమవుతున్నారు.
కాగా కాంగ్రెస్‌తో విభేదాలతో 1999లో ఎన్సీపీని స్థాపించిన శరద్ పవార్.. అప్పటి నుంచి ఆ పార్టీ జాతీయాధ్యక్షుడి పదవిలో కానసాగుతూ వచ్చారు. దాదాపు 24 ఏళ్లపాటు అధక్ష పదివి బాధ్యతలు చేపట్టిన పవార్.. ఇకపై ఎన్నికల్లో పోటీ చేయనని కూడా వెల్లడించారు.సరిగ్గా 1960 మే 1వ తేదీన మే డే నుంచి తన రాజకీయ ప్రస్థానం మొదలైంద, మనిషికి అత్యాశ ఉండకూడదని, ఇది ఎక్కడో ఒక దగ్గర ఆగాల్సిందేనని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
చదవండి: కోహ్లీ-గంభీర్ గొడవకు రాజకీయ రంగు.. బుద్ధిచెబుతామంటున్న కన్నడిగులు!
అయితే పవార్ అన్న కొడుకు అజిత్ పవార్.. ఎన్‌సీపీని వీడి బీజేపీ చేరతారనే ఊహాగానాల మధ్య పవార్ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అజిత్ పవార్ ఎన్సీపీలో చీలిక తీసుకొచ్చి.. తన అనుచరులతో బీజేపీలో చేరుతారంటూ ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలో శరద్ పవార్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment