న్యూఢిల్లీ: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌దే అసలైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అని ఎన్నికల సంఘం(ఈసీ)వెల్లడించిన నిర్ణయంపై ఆ పార్టీ పూర్వ అధినేత శరద్‌పవార్ సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దేశ అత్యున్నత కోర్టులో సోమవారం ఆయన పిటిషన్ దాఖలు చేశారు.
అజిత్ పవార్‌దే అసలైన ఎన్సీపీ అని ఈ నెల 6వ తేదీన తేల్చిన ఈసీ ఆ మరుసటి రోజే శరద్‌పవార్ వర్గానికి ఎన్సీపీ-శరద్‌పవార్ అనే పేరు కేటాయించింది. 1999లో స్థాపించి నిర్మించిన ఎన్సీపీని ఈసీ లాక్కుని వేరే వాళ్లకు ఇచ్చేసిందని, గతంలో ఇలాంటి ఘటన దేశంలో ఎప్పుడూ జరగలేదని శరద్‌పవార్ మండిపడ్డారు.
కాగా, గతంలో ఎన్సీపీ నుంచి వేరుపడిన శరద్‌పవార్ మేనల్లుడు అజిత్ పవార్ మహారాష్ట్ర బీజేపీ, శివసేన సంకీర్ణంలో చేరి ఉపముఖ్యమంత్రి అయ్యారు. తన వద్దే మెజారిటీ ఎమ్మెల్యేలున్నందున అసలైన ఎన్సీపీ తనదేనని అజిత్ పవార్‌లో ఈసీ తలుపు తట్టారు. దీంతో ఈసీ అసలైన ఎన్సీపీ అజిత్‌దేనని తేల్చింది.
Comments
Please login to add a commentAdd a comment