బహిష్కరణకు గురైన వ్యక్తి హోంమంత్రా? | Sharad Pawar attacks Amit Shah over corruption remark | Sakshi
Sakshi News home page

బహిష్కరణకు గురైన వ్యక్తి హోంమంత్రా?

Published Sun, Jul 28 2024 8:19 AM | Last Updated on Sun, Jul 28 2024 8:19 AM

Sharad Pawar attacks Amit Shah over corruption remark

సాక్షి, న్యూఢిల్లీ: ‘అవినీతికి కింగ్‌ పిన్‌’అంటూ కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తనపై చేసిన వ్యాఖ్యలపై ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్‌ పవార్‌ తీవ్రంగా మండిపడ్డారు. గతంలో సుప్రీంకోర్టు అమిత్‌ షాను గుజరాత్‌ నుంచి బహిష్కరించిన విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ..అటువంటి వ్యక్తి ఇప్పుడు దేశానికి ముఖ్యమైన హోం శాఖకు మంత్రి అయ్యారంటూ విస్మయం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎటు వెళ్తున్నామో ప్రజలు ఆలోచించాలన్నారు. 

అమిత్‌ షా దేశాన్ని తప్పుడు మార్గంలో తీసుకెళ్తున్నారని ఆరోపించారు. 2010లో సోహ్రబుద్దీన్‌ షేక్‌ ఎన్‌కౌంటర్‌ కేసులో అమిత్‌ షా రెండేళ్లపాటు గుజరాత్‌ నుంచి బహిష్కరణకు గురయ్యారు. అయితే, 2014లో ఈ కేసు నుంచి ఆయన నిర్దోషిగా బయటపడ్డారు. ఇటీవల పుణేలో జరిగిన ఓ కార్యక్రమంలో అమిత్‌ షా.. ప్రతిపక్షాలు తమపై అవినీతి ఆరోపణలు చేస్తున్నాయని, అయితే దేశ రాజకీయాల్లో అతిపెద్ద అవినీతి రారాజు శరద్‌ పవార్‌ అంటూ వ్యాఖ్యానించడం తెల్సిందే.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement