
దేశవ్యాప్తంగా పేరు మోసిన సింగర్ సిద్దూ మూసేవాలా రెండేళ్లక్రితం ప్రాణాలు విడిచారు. 2022లో ఆయన్ను దారుణంగా హత్య చేసి చంపారు. ఒక్కగానొక్క కొడుకు తమను విడిచి వెళ్లిపోవడంతో సిద్దు పేరెంట్స్ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అయితే సిద్దూ తల్లి చరణ్ సింగ్ ఐవీఎఫ్ పద్ధతి ద్వారా గర్భం దాల్చిందని, 58 ఏళ్ల వయసులో మరోసారి తల్లి కాబోతోందని ప్రచారం జరిగింది. తనకు ఈ నెలలో కవలలు పుట్టబోతున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
ఈ క్రమంలో సిద్దు తండ్రి బల్కౌర్ సింగ్ సదరు వార్తలను ఖండించాడు. మా కుటుంబాని గురించి ఆరా తీస్తున్న సిద్దు అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా గురించి లేనిపోనివన్నీ రాస్తున్నారు. అనేక రూమర్లు పుట్టిస్తున్నారు. దయచేసి వాటిని ఎవరూ నమ్మవద్దని కోరుతున్నాను. ఒకవేళ ఏదైనా ఉంటే మేమే మీకు స్వయంగా తెలియజేస్తాం అని ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చాడు. అయితే చరణ్ తల్లికాబోతున్న విషయాన్ని సిద్దు మూసేవాలా అంకుల్ చాంకౌర్ సింగ్ ధ్రువీకరించినట్లు తెలుస్తోంది. ఇప్పుడేమో తన గురించి వస్తున్న ఏ వార్తలనూ నమ్మవద్దని బల్కౌర్ కోరడం ఆసక్తికరంగా మారింది.
చదవండి: డిప్రెషన్.. ముద్ద దిగలేదు.. ఏడుస్తూ ఉండిపోయా.. నటి కన్నీళ్లు
Comments
Please login to add a commentAdd a comment