
మైసూరు(బెంగళూరు): తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న బంధువును భర్త హత్య చేశాడు. వివరాల ప్రకారం.. నంజనగూడు తాలూకా మాడ్రళ్లిలో శివణ్ణ (59) భార్యతో సిద్ధశెట్టి (47)కి వివాహేతరంసంబంధం ఏర్పడింది. దీనిపై ఇద్దరి భార్యాభర్తలకి మధ్య పలుసార్లు గొడవ జరిగింది. ఎన్ని సార్లు చెప్పినా శివణ్ణ భార్య సిద్ధశెట్టి తన సంబంధాన్ని కొనసాగిస్తూ భర్త మాట పట్టించుకోలేదు. ఆదివారం కూడా దీని గురించి మాట్లాడేందుకు వెళ్లి వారి గొడవ జరగ్గా శివణ్ణ కత్తితో సిద్ధశెట్టిని పొడిచాడు. తీవ్ర గాయాలతో అతడు మరణించాడు. శివణ్ణ పరారు అయ్యాడు.
మరో ఘటనలో..
క్యాంటర్, బైక్ ఢీ.. ఒకరు మృతి
దొడ్డబళ్లాపురం: క్యాంటర్– బైక్ ముఖాముఖి ఢీకొన్న ప్రమాదంలో బైక్ చోదకుడు మృతి చెందిన సంఘటన దొడ్డ గ్రామీణ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దొడ్డ తాలూకా మరళేనహళ్లి గ్రామానికి చెందిన హనుమంతరాయప్ప (48) మృతి చెందాడు. సోమవారం ఉదయం హనుమంతరాయప్ప మరళేనహళ్లి నుండి దొడ్డబెళవంగల వైపు బైక్‌పై వెళ్తుండగా క్యాంటర్‌ను ఎదురుగా ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. దొడ్డ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment