Telangana: Husband Killed Wife With Desi Gun In Bhadradri Kothagudem, Details Inside - Sakshi
Sakshi News home page

ఖమ్మంలో కాల్పులు.. నాటు తుపాకీతో భార్యను కాల్చిన భర్త

Jun 16 2023 7:41 AM | Updated on Jun 16 2023 9:43 AM

ప్రతీకాత్మక చిత్రం - Sakshi

సాక్షి, భద్రాద్రి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో దారుణం చోటుచేసుకుంది. భోజ్యా తండా పంచాయతీ పరిధిలోని పుల్లుడు తండాలో లావుడ్యా సామ అనే వ్యక్తి తరుచుగా మద్యం సేవించి భార్య శాంతిపై గొడవపడుతూ ఉండేవాడు. ఈ క్రమంలో రాత్రి ఇంటికి వచ్చాక భార్యతో గొడవపడిన సామ తన భార్య బయట దుకాణానికి వెళ్లి వస్తున్న క్రమంలో నాటు తుపాకితో వెనుక నుండి కాల్పులు జరిపాడు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోవడంతో సామ పరారయ్యాడు.

విషయం తెలుసుకున్న జూలూరుపాడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రక్తపు మడుగులో పడి ఉన్న శాంతిని కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స చేసిన డాక్టర్లు పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. కాగా గుండ్ల రేవు పంచాయతీ పరిధిలో ఉండే భర్త నాటు తుపాకితో భార్య గ్రామానికి వచ్చి కాల్పులు జరపడంతో కలకలం రేగింది. గ్రామానికి ఆనుకుని ఉండే అడవిలో జంతువులను వేటాడానికి సామ నాటు తుపాకీ వాడే వాడని దానితోనే ఇప్పుడు భార్య పై కాల్పులు జరిపాడని శాంత తల్లి, పిల్లలు బోరున విలపిస్తున్నారు. శాంతకు ముగ్గురు ఆడపిల్లలు, ఒక మగ పిల్లాడు ఉన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న సామ కోసం గాలిస్తున్నారు.

చదవండి: తల్లి, ఐదుగురు చిన్నారులు సజీవదహనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement