bhadadri dist
-
బ్యాంకు తప్పిదంతో రుణమాఫీకి దూరం
ఇల్లెందు: మండలంలోని రాఘబోయినగూడెం పంచాయతీ పరిధి మొట్లగూడెంనకు చెందిన రైతు గడిపర్తి వెంకటరామారావు బ్యాంకర్ల తప్పిదంతో రుణమాఫీ నగదు కోల్పోయాడు. ఆయన ఇల్లెందు డీసీసీబీలో రూ.1.06 లక్షల రుణం తీసుకోగా.. మొదటి, రెండు విడతల్లోనూ మాఫీ కాలేదు. ఈ విషయమై బ్యాంక్‌కు వెళ్లి మేనేజర్‌ను ఆరా తీశాడు. అయితే, ఏటా వడ్డీ చెల్లించి రెన్యువల్ చేయించుకునే క్రమంలో గత మార్చిలో ఆయన ఖాతాను సిబ్బంది రద్దు చేసి కొత్త ఖాతా తెరిచినట్లు తేలింది. దీంతో కొత్తగా రుణం తీసుకున్నట్లు ఆన్లైన్లో నమోదు కాగా, పాత ఖాతా నంబర్‌తో రుణమాఫీ మొత్తం మంజూరైనా ఆ ఖాతా మనుగడలో లేకపోవడంతో నిధులు వెనక్కి వెళ్లాయని గుర్తించారు. ఈ మేరకు తనకు న్యాయం చేయాలని వెంకటరామారావు కోరాడు. -
భద్రాద్రి: వరద నీటిలో 30 మంది కూలీలు.. హెలికాప్టర్ సాయంతో..
భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణవ్యాప్తంగా వర్షాలు దండికొడుతున్నాయి. భారీ వర్షాలు కురవడంతో వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ఇక, తాజాగా భద్రాద్రి జిల్లాలో పెద్దవాగు ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడంతో నీటిలో 30 మంది కూలీలు చిక్కుకున్నారు. వారిని హెలికాప్టర్ సాయంతో రక్షించారు.కాగా, భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ పరిధిలోని పెద్దవాగు ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం అధికారులు ప్రాజెక్ట్ గేట్లు ఎత్తారు. దీంతో ప్రాజెక్టు దిగువ భాగంలో ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగిపోయింది. ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెంలోని నారాయణపురం వద్ద 30 మంది కూలీలు వరదలో చిక్కుకున్నారు.వారంతా సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. వారి కుటుంబ సభ్యులకు ఫోన్లో ఈ విషయం చెప్పడంతో అధికారులు రంగంలోకి దిగారు. బాధితులను రక్షించేందుకు సీఎంవోతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంప్రదింపులు జరిపారు. హెలికాప్టర్ ద్వారా బాధితుల్ని రక్షించాలని ఆదేశించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందం, రెస్క్యూ టీమ్ సహాయ చర్యలు చేపట్టాలని సూచించారు. దీంతో, ఘటన స్థలానికి హెలికాప్టర్ చేరుకుని వారిని రక్షించారు.మరోవైపు.. పెద్దవాగు వరద ఉధృతిపై ప్రజలను అప్రమత్తం చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్, ఎస్పీలకు ఆయన ఫోన్ చేశారు. ప్రజలకు ఎలాంటి నష్టం జరుగకుండా చూడాలని వారికి ఆదేశాలు జారీ చేశారు. -
విజయవాడ రైలు పునఃప్రారంభం
కొత్తగూడెంఅర్బన్: భద్రాచలం రోడ్డు రైల్వే స్టేషన్ నుంచి విజయవాడ వరకు రాకపోకలు సాగించే విజయవాడ ఎక్స్‌ప్రెస్ రైలు శనివారం నుంచి పునఃప్రారంభమైంది. గత మే నెలలో రైల్వే లైన్ మరమ్మతుల కారణంగా విజయవాడ రైలును తాత్కాలికంగా రద్దు చేశారు. మరమ్మతులు పూర్తి కావడంతో తిరిగి ప్రారంభించారు. కొత్తగూడెం నుంచి రోజూ మధ్యాహ్నం 1.45 గంటలకు బయలుదేరి విజయవాడకు వెళ్లనుంది. విజయవాడ వెళ్లే ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు కోరారు.ఘనంగా బాలాజీ కల్యాణంఅన్నపురెడ్డిపల్లి: మండల కేంద్రంలోని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ బాలాజీ వెంకటేశ్వరస్వామి వారి కల్యాణాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఉదయం ఆలయంలో స్వామివారి కి అర్చనలు, ప్రత్యేక పూజలు చేసి పంచామృతంతో అభిషేకంజరిపారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు ప్రసాదాచార్యులు స్వామి వారి కల్యాణాన్ని వేదమంత్రాల నడుమ శాస్త్రోక్తంగా జరిపించారు. అనంతరం భక్తులకు స్వామి వారి తీర్థప్రసాదాలను అందించారు.అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలిసూపర్బజార్(కొత్తగూడెం): అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సమస్యలను పరిష్కరించాలని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి హరికృష్ణ డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ధర్నాచౌక్‌లో సమస్యల పరిష్కారం కోసం సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు చేపట్టిన రిలే దీక్షలు శనివారం ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. దీక్షలకు ఆయన మద్దతు తెలిపి మాట్లాడారు. రిటైర్మెంట్ బెన్ఫిట్స్ విషయంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి జి.పద్మ, నాయకులు ఎం.విజయశీల, కృష్ణవేణి, లక్ష్మి, ఆర్‌కెఎం లక్ష్మి, శాంతమ్మ, దేవులి, ఎల్లమ్మ, భాగ్యమ్మ, సాయమ్మ, అనసూర్య తదితరులు పాల్గొన్నారు.జనరల్ మజ్దూర్ల నుంచి దరఖాస్తుల ఆహ్వానంసింగరేణి(కొత్తగూడెం): సింగరేణి కొత్తగూడెం రీజియన్ పరిధిలోని మణుగూరు ఏరియాలోని భూగర్భ గనిలో పనిచేసేందుకు సంస్థవ్యాప్తంగా జనరల్ మజ్దూర్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ శనివారం జీఎం పర్సనల్ (ఐఆర్‌పీఎం) బీఆర్ దీక్షితులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వులను అన్ని ఏరియాలకు పంపించారు. సీనియారిటీని పరిగణనలోకి తీసుకుంటామని, విజిలెన్స్ కేసులో ఉన్నవారి దరఖాస్తులను పరిశీలనలోకి తీసుకోబోమని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.శ్రీ వేంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలుఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి గాంచిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీవారి పాదానికి, శ్రీస్వామి వారి విగ్రహానికి అర్చకులు వేదమంత్రాలు, పంచామృతాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత శ్రీస్వామి వారిని, శ్రీఅలివేలు మంగ ,శ్రీపద్మావతి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించడంతో పాటు శాస్త్రోక్తంగా నిత్య కల్యాణం నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులు శ్రీవారిని దర్శించుకుని పూజలు చేశరు. అర్చకులు, భక్తులు శ్రీస్వామి, , అమ్మవార్లకు పల్లకీ సేవ చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ జగన్మోహన్రావు, చైర్మన్ శ్రీరామచంద్రమూర్తి, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, సూపరింటెండెంట్ విజయకుమారి తదితరులు పాల్గొన్నారు. -
ఖమ్మంలో కాల్పులు.. నాటు తుపాకీతో భార్యను కాల్చిన భర్త
సాక్షి, భద్రాద్రి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో దారుణం చోటుచేసుకుంది. భోజ్యా తండా పంచాయతీ పరిధిలోని పుల్లుడు తండాలో లావుడ్యా సామ అనే వ్యక్తి తరుచుగా మద్యం సేవించి భార్య శాంతిపై గొడవపడుతూ ఉండేవాడు. ఈ క్రమంలో రాత్రి ఇంటికి వచ్చాక భార్యతో గొడవపడిన సామ తన భార్య బయట దుకాణానికి వెళ్లి వస్తున్న క్రమంలో నాటు తుపాకితో వెనుక నుండి కాల్పులు జరిపాడు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోవడంతో సామ పరారయ్యాడు. విషయం తెలుసుకున్న జూలూరుపాడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రక్తపు మడుగులో పడి ఉన్న శాంతిని కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స చేసిన డాక్టర్లు పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. కాగా గుండ్ల రేవు పంచాయతీ పరిధిలో ఉండే భర్త నాటు తుపాకితో భార్య గ్రామానికి వచ్చి కాల్పులు జరపడంతో కలకలం రేగింది. గ్రామానికి ఆనుకుని ఉండే అడవిలో జంతువులను వేటాడానికి సామ నాటు తుపాకీ వాడే వాడని దానితోనే ఇప్పుడు భార్య పై కాల్పులు జరిపాడని శాంత తల్లి, పిల్లలు బోరున విలపిస్తున్నారు. శాంతకు ముగ్గురు ఆడపిల్లలు, ఒక మగ పిల్లాడు ఉన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న సామ కోసం గాలిస్తున్నారు. చదవండి: తల్లి, ఐదుగురు చిన్నారులు సజీవదహనం -
పదవ తరగతి బాలికపై లైంగిక దాడి చేసిన కీచక టీచర్
-
పార్టీ ఆఫీసులో మహిళ మృతదేహం
-
భద్రాద్రి జిల్లాలో భారీ వర్షం
భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం ఉదయం భారీ వర్షం కురిసింది. అశ్వాపురం, మణుగూరు, బూర్గంపాడు, పినపాక, పాల్వంచ, ములకలపల్లి, భద్రాచలంలో ఉదయం నుంచి ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం కురుస్తోంది. ఉరుములు, మెరుపులతో వాతావరణం చల్లబడి పెను గాలులతో కూడిన వర్షం కురుస్తుండటంతో.. రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతికి వచ్చిన పంట అకాల వర్షాల బారిన పడి తడిసి పోవడంతో.. అన్నదాతలు కన్నీరుమున్నీరవుతున్నారు.