వివరాలు వెల్లడిస్తున్న పోలీసులు
సాక్షి,బీబీపేట(కామారెడ్డి): మహిళను లోబర్చుకున్నాడని ఓ వృద్ధుడిని మంత్రాల నెపంతో హత్య చేశారు. బీబీపేటలో శనివారం అర్ధరాత్రి జరి గిన ఈరోల్ల మల్లయ్య(62) హత్య కేసును పోలీసులు ఒక రోజు లోనే ఛేదించి నిందితులను రిమాండ్‌కు తరలించారు. మల్ల య్య హత్య కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం ప్రత్యేక నిఘా ఉంచగా బీబీపేట బస్టాండ్ వద్ద దొరికారు. నిందితులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. సోమవారం భిక్కనూర్ సీఐ తిరుపయ్య వివరాలు వెల్లడించారు. మృతుడు మల్లయ్య ఇంటి పక్కన ఉండే మహిళను లోబర్చుకుని వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీంతో మహిళ బంధువులు కొంగరి పోచయ్య, రాజ్‌కుమార్ నిందితుడిపై కక్ష పెంచుకున్నారు.
పలుమార్లు మల్లయ్య ను హెచ్చరించారు. అయినా తీరు మారకపోవడంతో మల్లయ్యను ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి మల్లయ్య, మహిళను తన ఇంట్లోకి తీసుకెళ్లి తలుపు వేసుకున్నాడు. దీంతో కొంగరి పోచయ్య, రాజ్ కుమార్‌లు గడ్డపారతో తలుపులు పగులగొట్టి ఇంట్లోకి వెళ్లి బ యటకు లాక్కొచ్చారు. మల్లయ్య తలపై బండరాయితో మోది, ద్విచక్ర వాహనంలో నుంచి పెట్రోల్ తీసి నిప్పంటించారు. తీవ్రంగా గాయపడ్డ మల్లయ్య అక్కడికకక్కడే మృతి చెందాడు. కాగా మృతుడు మల్లయ్యకు మంత్రాలు వస్తాయని, దీంతో మ హిళను లోబర్చుకున్నట్లు నిందితులు పోలీసులతో పేర్కొన్నా రు. పోలీసులు, నిందితులను మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పర్చ గా నిజామాబాద్ జైలుకు తరలించారు.
చదవండి: Extra Marital Affair: వివాహేతర సంబంధం.. పెళ్లి చేసుకోవాలని కోరడంతో..
Comments
Please login to add a commentAdd a comment