
సాక్షి,హైదరాబాద్: హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంట్లూరు గ్రామ శివారులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కుళ్ళిన స్థితిలో ఉండి కలకలం రేపింది. పూర్తిగా కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వనస్థలిపురం ఏసిపి పురుషోత్తం రెడ్డి, హయత్ నగర్ సిఐ వెంకటేశ్వర్లు సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేయగా.. మృతుడు ములుగు జిల్లాకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి రాజేష్ గా గుర్తించారు.
రాజేష్ ఒంటిపై తీవ్ర గాయలు ఉండడంతో మర్డర్ కేస్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఈ హత్య వెనుక ప్రేమవ్యవహారం ఏమైనా ఉందా లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: నల్లగొండ: విమాన డ్రోన్ కలకలం.. ఎయిర్‌టెల్ సిమ్, సీసీ కెమెరాలు..
Comments
Please login to add a commentAdd a comment