
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, మాలూరు(బెంగళూరు): మైనర్ బాలికను యువకుడు అత్యాచారం చేసి ఉరివేసి చంపాడు. ఈ ఘోరం తాలూకాలోని మాస్తి పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. భిన్నహళ్లి పంచాయతీ నిడమాకలహళ్లి గ్రామంలో 16 ఏళ్ల బాలికను అదే గ్రామవాసి మంజునాథ్ (27) అనే యువకుడు ఇంట్లో ఒక్కతే ఉండగా వచ్చి అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ సమయంలో బాలిక తల్లిదండ్రులు కూలిపనుల కోసం వేరే ఊరికి వెళ్లారు.
అత్యాచారం అనంతరం నేరం బయటపడుతుందని యువకుడు బాలికను ఇంట్లోనే చీరతో పైకప్పు కొక్కేనికి ఉరివేసి చంపినట్లు పోలీసులు చెప్పారు. నిందితునికి పెళ్లయి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బెంగళూరులో చిన్న ఉద్యోగం చేస్తూ కరోనా వల్ల వదిలేసి వచ్చాడు. హత్య విషయం తెలిసి బాలిక తల్లిదండ్రులు, గ్రామస్తులు నిందితుని ఇంటి ముందు ధర్నా చేశారు. దీంతో డీఎస్పీ రమేశ్, సీఐ వసంత్, ఎస్‌ఐ అనిల్ వెళ్లి నిందితునిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment