కన్నబిడ్డలాంటి ఆమెపై అకృత్యం | Man Molestation On Wife Sister In Shimoga Karnataka | Sakshi
Sakshi News home page

కన్నబిడ్డలాంటి ఆమెపై అకృత్యం

Feb 7 2022 10:15 AM | Updated on Feb 7 2022 11:12 AM

Man Molestation On Wife Sister In Shimoga Karnataka - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

శివమొగ్గ: భార్య చెల్లెలు.. పైగా మైనర్‌పై అత్యాచారానికి పాల్పడిన ఓ వ్యక్తిని పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. శివమొగ్గ జిల్లాలోని కుంసి పరిధిలో చోటుచేసుకున్న దారుణ ఘటనలోకి వెళ్తే.. సదరు బాధితురాలు.. అక్క-బావ ఇంట్లో ఉంటూ చదువుకుంటోంది. ఈ క్రమంలో కన్నబిడ్డలా చూసుకోవాల్సిన ఆ బాలికను.. కామంతో చూడడం మొదలుపెట్టాడు. భార్య కళ్లు గప్పి మాయమాటలు చెప్పి ఆ బాలికపై లైంగికవాంఛలు తీర్చుకుంటూ వచ్చాడు.

బాలికకు అనారోగ్యంగా ఉండటంతో అక్క చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లగా బాలిక ఏడు నెలల గర్భిణి అని వైద్యులు తెలిపారు. బాలికకు 18 ఏళ్లు నిండాయని చెప్పి గొడవ లేకుండా ఇంటికి తీసుకొచ్చారు. బాలికకు నొప్పులు రాగా మెగ్గాన్‌ ఆస్పత్రిలో చేర్పించారు. 7 నెలలకే ప్రసవం కాగా బిడ్డ మృతి చెందింది. విషయం పోలీసుల దృష్టికి రావడంతో.. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరె స్టు చేశారు కుంసి పోలీసులు.  

తీర్థహళ్లిలో మరో కేసు: తీర్థహళ్ళి పట్టణంలో మరో పోక్సో కేసు నమోదైంది. తాపీ పని చేయడానికి వచ్చిన యువకుడు స్థానిక బాలికతో పరిచయం పెంచుకుని లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక గర్భం దాల్చడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితున్ని అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement