
ప్రతీకాత్మక చిత్రం
తుమకూరు(బెంగళూరు): గుబ్బి తాలూకా కరిశెట్టిహళ్లిలో మంగళవారం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధం వల్ల మామే అల్లుణ్ని హత్య చేశాడు. చౌకెనహళ్లి మూడ్లయ్య(40) ఆరేళ్ల క్రితం జయణ్ణ కుమార్తెను వివాహం చేసుకున్నాడు. వేరే మహిళతో మూడ్లయ్య సంబంధం పెట్టుకున్నాడు. ఇది తగదని మూడ్లయ్యకు అతని మామ నచ్చజెప్పినా వినలేదు. సోమవారం అర్ధరాత్రి బైక్‌పై వస్తున్న మూడ్లయ్యను అడ్డగించి కొట్టి చంపేశాడు. దర్యాప్తు చేసిన పోలీసులు జయణ్ణ, అతని కొడుకుతో పాటు నలుగురిని అరెస్టు చేశారు.
మరో ఘటనలో..
తండ్రీ కొడుకు మృత్యువాత
మైసూరు: బైక్– కారు ప్రమాదంలో తండ్రీకొడుకులు మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన చామరాజనగర జిల్లా గుండ్లుపేట తాలూకా హిరికాటి గేట్‌లో జరిగింది. మైసూరు జిల్లా నంజనగూడుకు చెందిన శశికుమార్ (35), కుమారుడు దర్శన్ (6) మరణించారు. శశికుమార్ భార్య చైత్ర, గగన్ అనే మరో కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం ఈ నలుగురు బైక్‌లో వెళుతుండగా మైసూరు నుంచి గుండ్లుపేట వైపుగా వెళుతున్న కారు పెట్రోల్ బంక్‌లోకి హఠాత్తుగా టర్న్ తీసుకుంది. కారు వెనుకనే వస్తున్న శశికుమార్ బైక్‌ను అదుపుచేయలేక కారును ఢీకొట్టాడు. కారు డ్రైవర్‌ను బేగూరు పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేసుకున్నారు.
చదవండి: ఇంట్లో భోజనం చేస్తుండగా బైకుపై వచ్చి.. భార్య కళ్లముందే..
Comments
Please login to add a commentAdd a comment