
ప్రముఖ బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్‌కు బెదిరింపులు వచ్చాయి. సల్మాన్‌ను చంపేస్తామని కెనడాకు చెందిన పరారీలో ఉన్న కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ హెచ్చరించాడు. సల్మాన్ తమ కిల్ లిస్ట్‌లో ఉన్నాడని వెల్లడించాడు. హీరో సల్మాన్‌ను చంపేస్తామని గత మార్చిలోనే మెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. తాజాగా ఓ ప్రముఖ మీడియా సంస్థ నిర్వహించిన ఇంటర్యూలో గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ బహిరంగంగానే బెదిరింపులకు పాల్పడ్డాడు. పంజాబ్ సింగర్, రాజకీయ నాయకుడు సిద్ధూ మూసే వాలా హత్యలో గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ కీలక సూత్రధారి అని ఆరోపణలు కూడా ఉన్నాయి.
'మేము ఇంతకు ముందే చెప్పాం. ఒక్క సల్మాన్‌నే కాదు.. జీవించి ఉన్నతం కాలం మా శత్రువులను చంపేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం. సల్మాన్‌ను మాత్రం ఖచ్చితంగా చంపేస్తాం. అందుకు మా ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయ్. మేము ఖచ్చితంగా విజయం సాధిస్తాం.' అని గోల్డీ బ్రార్ తెలిపారు.
గత మార్చిలోనే సల్మాన్ ఖాన్ సన్నిహితుడైన ప్రశాంత్ గుంజాల్కర్‌కు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. హీరో సల్మాన్‌ను చంపేస్తామని అందులో పేర్కొన్నారు. గతంలో అరెస్టైన లారెన్స్ భిష్ణోయ్ అంశంలో గోల్డీ బ్రార్ సల్మాన్‌తో మాట్లాడాలనుకుంటున్నట్లు ఆ మెయిల్‌లో కోరారు. అప్పట్లో ఆ మెయిల్‌లపై గ్యాంగ్‌స్టర్ లారెన్స్ భిష్ణోయ్, గోల్డీ బ్రార్‌లపై కేసులు నమోదు చేశారు పోలీసులు.
#EXCLUSIVE | Gangster #GoldyBrar's open threat to Salman Khan; man running India's biggest gang network speaks to India Today's @arvindojha. Here's the detailed report. #5ivLive with @nabilajamal_ - https://t.co/pEYfdF77O1 pic.twitter.com/dF0V2Bnnnq
— IndiaToday (@IndiaToday) June 26, 2023
కెనడాలో టాప్ 25 మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ ఉన్నాడు. ప్రస్తుతం బ్రార్ కెనడాలోనే ఉన్నారని చాలా మంది విశ్వసిస్తారు. ఇండియాలో చాలా క్రిమినల్ నేరాల్లో అతని హస్తం ఉందని ఆరోపణలు ఉన్నాయి. కెనడాలో మాత్రం అతనిపై ఎలాంటి క్రిమినల్ నేర చరిత్ర ఆధారాలు లేనట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: రెచ్చిపోయిన దొంగలు.. గన్‌తో బెదిరించి.. కారును అడ్డగించి.. వీడియో వైరల్..