సాక్షి, గడివేముల: నంద్యాల జిల్లా మహిళను ప్రేమించిన ఓ పాకిస్తాన్ పౌరుడు ఆమె కోసం దేశంలోకి అక్రమంగా వచ్చాడు. ఆపై ఇక్కడ ప్రేమౖ‘ఖెదీ’గా మారాడు. వివరాల్లోకి వెళ్తే... పాకిస్తాన్‌లోని సియాకోట్ జిల్లా కుల్లులార్ గ్రామానికి చెందిన గుల్జార్‌ఖాన్‌కు 2008లో రాంగ్ కాల్ ద్వారా నంద్యాల జిల్లా గడివేములకు చెందిన దౌలత్‌బీతో పరిచయం ఏర్పడింది.
అప్పటికే దౌలత్‌బీకి భర్త చనిపోయాడు. ఒక కుమారుడు కూడా ఉన్నాడు.
అయినప్పటికీ గుల్జార్ తాను ప్రేమించిన దౌలత్‌బీ కోసం 2011లో తాను పనిచేస్తున్న సౌదీ అరేబియా నుంచి భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించాడు. గడివేములకు చేరుకుని 2011, జనవరి 25న కర్నూలులో దౌలత్‌బీని వివాహం చేసుకున్నాడు. సమీప గ్రామాల్లో పెయింటింగ్ పనులు చేస్తూ అక్కడే ఉండిపోయాడు. ఈ దంపతులకు నలుగురు పిల్లలు జని్మంచారు. గుల్జార్, అతని భార్య, పిల్లలకు గడివేములలోనే ఆధార్ కార్డులు పొందారు. వాటి ఆధారంగా తనతోపాటు భార్య, ఐదుగురు పిల్లలను సౌదీ అరేబియాకు తీసుకువెళ్లేందుకు వీసా తీసుకున్నాడు. అక్కడి నుంచి పాకిస్తాన్‌కు వెళ్లాలని ప్రణాళిక రూపొందించుకున్నారు.
ఈ మేరకు 2019లో సౌదీ వెళ్లేందుకు గడివేముల నుంచి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకోగా, అక్కడ పోలీసులు గుల్జార్‌ను అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఆరు నెలలు అనంతరం విడుదల చేశారు. అప్పటి నుంచి గుల్జార్ గడివేములలోనే ఉంటున్నాడు. అయితే, 2022, ఫిబ్రవరి 9న మళ్లీ గుల్జార్‌ను అరెస్టు చేసి మళ్లీ చర్లపల్లి జైలుకు తరలించారు. దీంతో దౌలత్‌బీ మళ్లీ కోర్టుల చుట్టూ తిరిగి తన భర్తను కండీషన్ బెయిల్‌పై ఈ నెల 20న బయటకు తీసుకువచ్చింది. గడివేముల వచి్చన గుల్జార్‌ను ఆదివారం పోలీసులు స్టేషన్‌కు తీసుకువెళ్లి విచారించారు. ఈ నెల 27న హైదరాబాద్ కోర్టులో గుల్జార్ హాజరుకావాల్సి ఉందని దౌలత్‌బీ తెలిపింది.
ఇది కూడా చదవండి: ఇదో వింత ప్రేమ.. ఇద్దరు పిల్లలున్నా పాక్ యువకుడితో ప్రేమ.. అతడి కోసం సరిహద్దు దాటి..
Comments
Please login to add a commentAdd a comment