
రాయికల్: ఉద్యోగం కోసం జోర్డాన్ దేశం వెళ్లిన మేడిపల్లి అబ్బాయి.. శ్రీలంక అమ్మాయి మధ్య ప్రేమ చిగురించింది. వీరి ప్రేమకు కుటుంబసభ్యులు అంగీకారం తెలపడంతో హిందూసాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. మెట్‌పల్లి మండలం మూడుబొమ్మల మేడిపల్లి గ్రామానికి చెందిన జొరిగె అశోక్ ఉద్యోగం కోసం జోర్దాన్ దేశానికి వెళ్లాడు. అక్కడ శ్రీలంక దేశానికి చెందిన సమన్వి పరిచయమైంది. ఇరువురి మధ్య ప్రేమ చిగురించింది.
వీరి ప్రేమకు కుటుంబసభ్యులు అంగీకారం తెలపడంతో అశోక్ అక్కాబావలైన రాయికల్ మండలం రామాజీపేటకు చెందిన చేగంటి శేఖర్–పూజితలు హిందూ సాంప్రదాయ ప్రకారం భూపతిపూర్‌లోని లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో వీరి వివాహం జరిపారు. దంపతులను ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, మాజీ సర్పంచులు వాసరి రవి, మాజీ ఎంపీటీసీ బెజ్జంకి మోహన్, వైస్ ఎంపీపీ మహేశ్వర్‌రావు ఆశీర్వదించారు.
Comments
Please login to add a commentAdd a comment