రొంపిచెర్ల: ప్రేమ వివాహం వద్దని ప్రియుడు కట్టిన తాళిబొట్టును తెంచినా ఆ యువతి కన్నతల్లిని ఎదిరించి ప్రేమికుడి వెంట వెళ్లిన సంఘటన రొంపిచెర్ల మండలంలో మంగళవారం జరిగింది.
స్థానికుల కథనం మేరకు.. గానుగచింతకు చెందిన యువకుడు రెడ్డెప్ప (21), తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేటకు చెందిన చిట్టి ప్రసన్న(19) అన్నమ్మయ్య జిల్లా పీలేరులో డిగ్రీ చదువుతున్నారు. వీరిద్దరూ ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే చిట్టి ప్రసన్నకు వివాహం చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించారు. దీంతో చిట్టి ప్రసన్న ఇంటి నుంచి మంగళవారం ఉదయం రొంపిచెర్లకు చేరుకుని జరిగిన విషయం ప్రియుడు రెడ్డెప్పకు చెప్పింది. దీంతో వారిద్దరూ కట్టకింద శివాలయంలో వివాహం చేసుకున్నారు.
ఈ విషయం తెలుసుకున్న చిట్టి ప్రసన్న తల్లి కుమారై మెడలో ఉన్న తాళిబొట్టును తెచ్చి ఇంటికి రావాలని కుమారైను పిలిచింది. అయితే దీనికి కుమారై అంగీకరించలేదు. దీంతో ఈ పంచాయితీ రొంపిచెర్ల పోలీసుస్టేషన్‌కు చేరింది. ఎస్‌ఐ సుబ్బారెడ్డి ప్రేమికులను విచారించారు. పోలీసుల విచారణలో ప్రేమికురాలు తన ఇష్ట ప్రకారమే వివాహం చేసుకున్నాని తెలిపింది. తాను మేజర్‌నని తనకు తన భర్త కావాలని తెగేసి చెప్పింది. దీంతో పోటీసులు చేసేదేమీ లేక వారిని కలసి ఉండమని చెప్పారు. దీంతో ఇరువురు గానుగచింతకు చేరుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment