వైద్య చరిత్రలో మరో రికార్డిది! | Conjoined twins separated, both out of surgery | Sakshi
Sakshi News home page

వైద్య చరిత్రలో మరో రికార్డిది!

Published Sat, Oct 15 2016 2:33 PM | Last Updated on Fri, Aug 24 2018 8:18 PM

వైద్య చరిత్రలో మరో రికార్డిది! - Sakshi

వైద్య చరిత్రలో మరో రికార్డిది!

- 13 నెలల కవలలకు 27 గంటలపాటు ఆపరేషన్
- విజయవంతంగా కపాలాలను వేరుచేసిన అమెరికన్ వైద్యులు


న్యూయార్క్: తెలుగు బాలికలు వీణా-వాణిల లాగే తలలు అతుక్కుని పుట్టిన ఈ చిన్నారులది అమెరికాలోని న్యూయార్క్ నగరం. 13 నెలల ఈ కవలల పేర్లు జేడన్, అనియాస్. వీళ్లిద్దరినీ వేరు చేసేందుకు అక్కడి మాంటెఫెర్ పిల్లల ఆసుపత్రి వైద్యులు నిర్వహించిన 27 గంటల ఆపరేషన్ వైద్య చరిత్రలో సరికొత్త అధ్యాయంగా నిలిచింది. వివరాల్లోకి వెళితే..

నికోల్‌, క్రిస్టినా దంపతులకు రెండో సంతానంగా జన్మించిన కవలలకు తలలు అతుక్కుని ఉన్నాయ. విడివిడిగా కాకుండా కపాలాలు రెండూ కలిసిపోయినట్లు వైద్యులు గుర్తించారు. దీంతో ఆ తల్లిదండ్రులు డాక్టర్ జేమ్స్ గుడ్ రిచ్ ను సంప్రదించారు. అప్పటికే కష్టతరమైన ఆపరేషన్లు ఎన్నో చేసిన అనుభవం ఉందాయనకు. అయితే జేడాన్, అనియాస్ లది కష్టతరమైన కేసు. చిన్న తేడా వచ్చినా పిల్లల ప్రాణాలు పోతాయి. చివరికి తల్లిదండ్రుల ఒత్తిడి మేరకు ఆపరేషన్ ఏర్పాటుకు రంగం సిద్దమైంది.

డాక్టర్ జేమ్స్ ఆధ్వర్యంలో మొత్తం 20 మంది వైద్యులు 27 గంటలపాటు ఆపరేషన్ నిర్వహించారు. మొదటి 16 గంటలు పిల్లల తలలను వేరుచేయడానికే పట్టింది. తర్వాత త్రీడీ టెక్నాలజీ సాయంతో కపాలాలను వేరుచేశారు. సర్జరీకి మరో 11 గంటలు పట్టింది. ఆపరేషన్ విజయవంతంగా ముగిసిన వెంటనే తల్లిదండ్రులు పిల్లల్ని చూసుకుని మురిసిపోయారు.






Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement