థాయ్‌లాండ్: కరోనా (కోవిడ్-19) వైరస్ టెర్రర్ ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతోంది. చాలా దేశాల్లో స్కూళ్లు, కాలేజీలు, యూనివర్శిటీలు మూతపడ్డాయి. అటు ప్రయాణాలపై ఆంక్షలు విధించారు. నిన్న మొన్నటి వరకూ కిటకిటలాడిన పర్యాటక ప్రదేశాలు, విమానాశ్రయాలు ఇప్పుడు బోసిపోయి కనిపిస్తున్నాయి. యూరప్ దేశాల్లో ఎప్పుడు ఏం మూతపడతాయన్న భయంతో జనం సూపర్ మార్కెట్లకు పరుగులు తీస్తున్నారు. వాటర్ బాటిల్ నుంచి టాయిలెట్ రోల్ వరకూ ఇలా భారీ స్థాయిలో నిత్యావసరాలు కొనుక్కొని.. ఇళ్లనే సూపర్ మార్కెట్లుగా మార్చేస్తున్నారు.
కోవిడ్ ఎఫెక్ట్ ఎలా ఉందంటే...
ఇక థాయ్‌లాండ్‌లోని లోప్‌బురిలో పర్యాటకులు రాక.. వారిచ్చే ఆహారం లేకపోవడంతో వందలాది కోతులు ఆహారం కోసం రోడ్ల మీద పడ‍్డ దృశ్యాలు వైరల్‌గా మారాయి. (కోవిడ్-19పై కేంద్రం కీలక నిర్ణయం!)
మరోవైపు కరోనా వైరస్ విజృంభణతో అగ్రరాజ్యం అమెరికా వణికిపోతోంది. అమెరికా ప్రభుత్వం అక్కడి విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. ప్రభుత్వ కార్యాలయాలు, వైట్ హౌస్ సహా అత్యవసర సేవలు మినహా) ఇంటి నుంచే పని చేని చేయాలని ఆదేశించింది. (కోవిడ్: చైనా రాయబారికి అమెరికా నోటీసులు)
వేలాదిమంది ప్రయాణికులతో కిటకిటలాడే న్యూయార్క్, శాన్‌ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజెలెస్, సియాటిల్, షికాగో విమానాశ్రయాలు బోసిపోయాయి.
జేఎఫ్‌కె ఎయిర్‌పోర్టు, న్యూయార్క్
లండన్‌లో ప్రయాణికులు లేకపోవడంతో బోసిపోయిన ట్రైన్
కువైట్‌లో కోవిడ్ పరీక్షల కోసం
ఇరాన్ కేబినెట్ సమావేశం
Comments
Please login to add a commentAdd a comment