కొలంబియాలోని లా గ్వాజిరా రాష్ట్ర గవర్నర్ జాన్ ఫ్రాన్సిస్కో కికో గోమెజ్ హత్య కేసులో అరెస్టయ్యారు.
కొలంబియాలోని లా గ్వాజిరా రాష్ట్ర గవర్నర్ జాన్ ఫ్రాన్సిస్కో కికో గోమెజ్ హత్య కేసులో అరెస్టయ్యారు. హత్య, నేరపూరిత కుట్ర అభియోగాలు మోపుతూ మూడు సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేసినట్టు ఆ దేశ అటార్నీ జనరల్ కార్యాలయ అధికారులు తెలిపారు. నేరచరిత ముఠాలతోనూ గోమెజ్కు సంబంధాలున్నట్టు అభియోగాలు మోపారు.
1997లో జరిగిన ఓ రాజకీయ నాయకుడి హత్య, 2000లో జరిగిన మరో మూడు హత్య కేసుల్లో ఆయన ప్రమేయమున్నట్టు తగిన ఆధారాలున్నాయని అధికారులు చెప్పారు. అరెస్ట్ను అడ్డుకునేందుకు గోమెజ్ అంగరక్షకులు ప్రయత్నించినట్టు సమాచారం.