ప్రపంచ అండర్–20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో పతకం వచ్చింది. కొలంబియాలో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్‌లో మహిళల 400 మీటర్ల విభాగంలో ఉత్తర ప్రదేశ్‌కు చెందిన రూపల్ చౌదరీ కాంస్య పతకాన్ని సాధించింది. 17 ఏళ్ల రూపల్ 400 మీటర్ల దూరాన్ని 51.85 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచింది.
యెమీ మేరీజాన్ (బ్రిటన్; 51.50 సెకన్లు) స్వర్ణం గెలిచింది. ఈ పతకంతో రూపల్ ప్రపంచ అండర్–20 చాంపియన్‌షిప్‌లో రెండు పతకాలు నెగ్గిన తొలి భారతీయ అథ్లెట్‌గా గుర్తింపు పొందింది. 4X400 మీటర్ల మిక్స్‌డ్ రిలే ఈవెంట్‌లో రజతం నెగ్గిన భారత బృందంలో రూపల్ సభ్యురాలిగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment