బ్రెజిల్‌కు పెను విషాదం.. కుప్పకూలిన విమానం
బొలివియా నుంచి బయలు దేరిన ఈ విమానం కొలంబియా చేరుకునే సమయంలోనే రాడార్‌నుంచి నుంచి తప్పిపోయిందని, ఆ తర్వాతే అది నగరం శివారు ప్రాంతాల్లోని పెద్ద పర్వాతాల్లో కూలిపోయినట్లు గుర్తించినట్లు మెడిలిన్ ఎయిర్ పోర్ట్ సిబ్బంది ట్విట్టర్ ద్వారా చెప్పారు. కొలంబియాలో జరుగుతున్న కోపా సుడామెరికా ఫైనల్స్‌లో పాల్గొనేందుకు వీరంతా బయలు దేరినట్లు తెలిసింది. ఎంతమంది చనిపోయి ఉంటారనే విషయంపై స్పష్టత లేదు. బ్రెజిల్ కాలమానం ప్రకారం సోమవారం అర్థరాత్రి తరువాత ఈ విమానం కూలిపోయింది. ఇంధనం లేక విమానం ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. పదిమంది గాయపడినట్లు కొన్ని వార్తా సంస్థలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా, గతంలో ఇదే విమానంలో అర్జెంటీనా టీమ్ ప్రయాణించిందట.