ఇంధనం అయిపోవడంతోనే 71 మంది మృతి | Chapecoense plane ran out of fuel: Officials | Sakshi
Sakshi News home page

ఇంధనం అయిపోవడంతోనే 71 మంది మృతి

Published Tue, Dec 27 2016 9:05 AM | Last Updated on Mon, Sep 4 2017 11:44 PM

ఇంధనం అయిపోవడంతోనే 71 మంది మృతి

ఇంధనం అయిపోవడంతోనే 71 మంది మృతి

బొగొటా: గత నెల 29వ తేదీన కొలంబియాలో జరిగిన విమాన ప్రమాదంలో 71 మంది మృతి చెందారు. మృతిచెందిన వారిలో 19 మంది బ్రెజిల్‌కు చెందిన చెపకొయిన్స్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ క్రీడాకారులు, సిబ్బంది ఉన్నారు. ఈ విమాన ప్రమాదంపై జరిపిన విచారణలో.. ఇంధనం అయిపోవడం మూలంగానే ప్రమాదం జరిగిందని కొలంబియన్‌ సివిల్‌ ఏవియేషన్‌ అథారిటీ అధికారులు గుర్తించారు.

విమానం మెడిలిన్స్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకునే సమయంలో సమీపంలోని కొండల్లో కూలిపోయింది. ప్రాధమిక దర్యాప్తులో ఇంధనం అయిపోవడంతో పాటు.. విమానం నిర్ధేశించిన దానికన్నా ఓ 500 కిలోలు ఎక్కువ బరువుతో వెళ్తున్నట్లుగా కూడా గుర్తించామని అధికారులు మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రమాదంలో మృతి చెందిన విమాన పైలట్‌ మిగుయల్‌ కైరోగా.. ఎమర్జెన్సీ ప్రకటించడానికి ఎక్కువ సమయం తీసుకున్నాడని ఎయిర్‌లైన్స్‌ సెక్యూరిటీ సెక్రెటరీ ఫ్రెడ్డీ బొనిల్లా తెలిపారు. కూలిపోవడానికి కేవలం రెండు నిమిషాల ముందే విమానం పూర్తిగా ఫెయిల్‌ అయిన విషయాన్ని పైలట్‌ రిపోర్ట్‌ చేశాడని ఆయన తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement