I-League: Sreenidi Deccan FC beat NEROCA FC 1-0 - Sakshi
Sakshi News home page

Sreenidi Deccan FC: దేశవాళీ ఫుట్‌బాల్‌ టోర్నీ.. ఆరో విజయం.. టాప్‌లో శ్రీనిధి డెక్కన్‌

Published Thu, Dec 22 2022 8:27 AM | Last Updated on Thu, Dec 22 2022 11:35 AM

I League: Sreenidi Deccan FC Beat Neroca FC With 1 0 Top - Sakshi

I-League 2022-23- ఇంఫాల్‌: భారత దేశవాళీ ఫుట్‌బాల్‌ టోర్నీ ఐ–లీగ్‌లో హైదరాబాద్‌కు చెందిన శ్రీనిధి డెక్కన్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ (ఎఫ్‌సీ) ఆరో విజయం నమోదు చేసింది. బుధవారం జరిగిన తొమ్మిదో లీగ్‌ మ్యాచ్‌లో శ్రీనిధి డెక్కన్‌ ఎఫ్‌సీ 1–0 గోల్‌ తేడాతో నెరోకా ఎఫ్‌సీ జట్టును ఓడించింది.

ఆట 47వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్‌ రామ్లున్‌చుంగా శ్రీనిధి జట్టుకు గోల్‌ అందించాడు. ప్రస్తుతం శ్రీనిధి జట్టు 19 పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌లోఉంది. 

26న రాష్ట్ర ర్యాంకింగ్‌ చెస్‌ టోర్నీ 
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర చెస్‌ సంఘం (టీఎస్‌సీఏ) ఆధ్వర్యంలో ఈనెల 26న తెలంగాణ రాష్ట్ర ర్యాంకింగ్‌ చెస్‌ టోర్నీ జరగనుంది. లాల్‌బహదూర్‌ స్టేడియంలోని యోగా హాల్‌ వేదికగా జరిగే అండర్‌–7, 9, 11, 13, 15, 17, 19 బాల బాలికల విభాగాల్లో ఈ టోర్నీని నిర్వహిస్తారు.

స్పాట్‌ ఎంట్రీలు స్వీకరించరు. టోర్నీలో పాల్గొనాలనుకునే వారు 7337578899 లేదా 7337399299 ఫోన్‌ నంబర్లలో నిర్వాహకులను సంప్రదించి తమ పేర్లను నమోదు చేసుకోవాలని టీఎస్‌సీఏ అధ్యక్షుడు కేఎస్‌ ప్రసాద్‌ కోరారు.   

చదవండి: ICC Test Rankings: అదరగొట్టిన అక్షర్‌ పటేల్‌... కుల్దీప్‌, పుజారా, గిల్‌ సైతం..
BCCI: మా వల్ల కాదు.. తప్పుకొనే యోచనలో టీమిండియా ప్రధాన స్పాన్సర్‌! కిట్‌ స్పాన్సర్‌ కూడా! కారణం?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement